శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వాసు
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (15:25 IST)

తనయుడికి కాకపోతే తండ్రికి... జగనన్న షాక్

ఎన్నికల జోరు ఊపందుకొంటున్న వేళ... రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఆశావహులకు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా పర్చూరు సీటు ఆశించి ఇటీవలి కాలంలో వైకాపాలో చేరిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు హితేష్‌లలో, దగ్గుబాటి హితేష్‌కు జగనన్న తన స్టైల్ ఫ్యాన్ షాక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. 
 
హితేష్‌ అమెరికా పౌరసత్వం రద్దు కాకపోవడాన్ని కారణంగా చూపుతూ టికెట్‌ ఇచ్చే విషయంలో జగన్‌ పునరాలోచనలో పడినట్లు సమాచారం. పర్చూరు వైకాపా అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావును రంగంలోకి దించబోతున్నట్లు కూడా అనధికారిక వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అంతేగా మరి... తనయుడికి కాకపోతే తండ్రికి... ఏ పదవైనా... ఏమైనా అటు తిరిగీ... ఇటు తిరిగీ కుటుంబం దాటిపోకుండా ఉంటే చాలు.