1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Raghuramakrishnam raju sensational comments

ఎంపీ పదవికి రాజీనామా చేస్తా: రఘురామకృష్ణంరాజు

Raghuramakrishnam raju
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మళ్లీ వార్తల్లో నిలిచారు. తాజాగా రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు ప్రయత్నిస్తున్నారని… అయినా వారి ప్రయత్నాలు సాధ్యం కాలేదన్నారు. తన కోసం వైసీపీ నేతలు పడుతున్న పాట్లను చూస్తుంటే తనకే జాలి వేస్తుందని ఎద్దేవా చేశారు.
 
అయితే ఎంపీ పదవికి తానే రాజీనామా చేస్తానని రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు. రాజధానిగా అమ‌రావ‌తిని కొన‌సాగించాల‌నే డిమాండ్ కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నాన‌ని వివ‌రించారు. త‌న‌పై అనర్హత వేటు వేయ‌క‌పోయినా తానే రాజీనామా చేస్తాన‌ని చెప్పారు. 
 
రాజీనామా చేసి ఎన్నిక‌ల‌కు వెళ్తాన‌ని… వైసీపీపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంద‌న్న విష‌యాన్ని ఉపఎన్నిక ద్వారా తెలియ‌జేస్తాన‌ని రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. ఏపీలో అన్ని రంగాల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులు చేసిన త‌ప్పేంటని ఆయన నిల‌దీశారు.
తర్వాతి కథనం
సీఎం జగన్ ఆ పని చేస్తే ఎంపీ పదవికి రాజీనామా : ఆర్ఆర్ఆర్ ప్రకటన