సంబంధిత వార్తలు
- ఉన్నావ్ రేప్ కేసు: 'ఎన్నాళ్లు భయపడతాం? చంపేస్తే చంపేయనీయండి'
- ఉన్నావ్ రేప్: దర్యాప్తు నివేదిక ఇవ్వాలని సీబీఐకి సుప్రీం ఆదేశం... ఈ కేసులో ఎప్పుడేం జరిగింది?
- స్నేహితుడే చెరిచాడు.... మత్తు మందు కలిపి 29 రోజులు అత్యాచారం....
- అత్యాచారం చేసి యువతిని పూడ్చేశాడు.. రెండుగంటల తరువాత బతికొచ్చిన యువతి..ఎలా..?
- అత్యాచారం చేసింది బీజేపీ ఎమ్మెల్యే అయితే ప్రశ్నించొద్దు : రాహుల్
తరగతి గదిలో రేప్ ప్రాక్టికల్స్... విద్యార్థులతో డెమో చేయించిన కీచక టీచర్లు
విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన గురువులు... తమలోని వక్రబుద్ధిని బయటపెట్టారు. విద్యార్థులతో రేప్ డెమో చేయించారు. ఈ డెమో చేస్తూ ఓ విద్యార్థిని గాయపడింది. దీంతో ఈ విషయం బయటకు పొక్కడంతో గ్రామస్థులు ఆ ఇద్దరు ఉపాధ్యాయులకు దేహశుద్ధి చేశారు.
ఈ ఘటన వెస్ట్ గోదావరి జిల్లా చింతలపూడిలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, చింతలపూడి ప్రైమరీ పాఠశాలలో రాజశేఖర్, ఉమామహేశ్వర రావులు స్థానికంగా ఉండే ప్రైమరీ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఈ ఇద్దరు టీచర్లకు ఓ వికృతమైన ఆలోచన వచ్చింది.
ఈ ఆలోచన వచ్చిందే తడవుగా నేరుగా తరగతి గదిలోకి వెళ్లి... అత్యాచారం ఎలా చేస్తారో చేసి చూపించాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో వారు మార్గం లేక.. తరగతి గదిలోనే రేప్ డెమోకు పూనుకున్నారు. ఈ డెమో చేస్తూ ఓ విద్యార్థిని గాయపడింది.
ఫలితంగా ఈ విషయం బయటకు పొక్కింది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన గ్రామస్థులు ఇద్దరు ఉపాధ్యాయులను పట్టుకుని చితకబాదారు. పైగా, ఈ విషయం విద్యాశాఖ ఉన్నతాధికారులకు, పోలీసులకు తెలిస్తే తమ ఉద్యోగాలు పోతాయని భావించి, గ్రామస్థులతో రాజీకొచ్చారు. ఇందుకోసం వారు తలా రూ.80 వేలు చొప్పున చెల్లించారు.
అయితే, ఈ విషయం ఆ నోటా, ఈ నోటా పాకి.. చివరకు జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. చిన్నారులను సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
