శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 3 ఆగస్టు 2019 (08:15 IST)

పిల్లల్ని ఆ క్యాబ్ డ్రైవర్ ఏం చేయబోయాడో చూడండి

తమ బిడ్డలను కిడ్నాప్ చేసి కారులో పారిపోతున్న వారిని  తల్లిదండ్రులు అయిదు కిలో మీటర్లు ఛేజ్ చేసి వారిని రక్షించుకున్న సంఘటన శంషాబాద్ లో జరిగింది.. వివరాలలోకి వెళితే ..

ముంబై నుంచి హైదరాబాద్ కు విమానంలో  రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకి చేరుకుంది ఒక కుటుంబం..వచ్చిన కుటుంబం, నగరంలోకి వెళ్లేందుకు రెండు వేరువేరు క్యాబ్ లను బుక్ చేసుకుంది. పెద్దలు ఓ క్యాబ్ లో, పిల్లలు ఓ క్యాబ్ లో ఎక్కారు. అయితే  పిల్లలున్న క్యాబ్ తో పారిపోయాడు డ్రైవర్.

షాక్ గురైన తల్లిదండ్రులు వెంటనే ఆ కారును మరో కారుతో ఛేజ్ చేశారు.. ఇదే సందర్భంగా కిడ్నాప్ సమాచారాన్ని పోలీసులకు అందించారు.. ఒక వైపు పోలీసులు, మరో వైపు తల్లిదండ్రులు దాదాపు అయిదు కిలోమీటర్లు ఛేజ్ చేసి కారును అడ్డుకున్నారు.. ఆ క్యాబ్ లోని పిల్లలను రక్షించుకున్నారు.. డ్రైవర్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు..