సంబంధిత వార్తలు
- 2021-22లో ప్రాధాన్యతా రంగంలో..రూ.2.31లక్షల కోట్ల ఋణాలు: నాబార్డు అంచనా
- రాష్ర్టంలో లాక్డౌన్ విధించం : సీఎం కేసీఆర్
- అటానమస్ కళాశాలల్లో అకడమిక్ ఆడిట్: విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
- కేసీఆర్ విద్యార్థుల బతుకును నడి రోడ్డున పడేసిండు: ఓయు విద్యార్థి సంఘాలు
- వైద్యం చేసి మానవత్వం చాటుకున్న తిరుపతి వైసిపి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి
మే 3 నుంచి రాజధాని కేసులపై మళ్లీ విచారణ
అమరావతి నుంచి రాజధాని తరలించకూడదని రైతులు, ఇతరులు వేసిన పిటిషన్‌పై మే 3 నుంచి హైకోర్టులో విచారణ ప్రారంభం కానుంది. పిటిషన్‌లపై మళ్లీ మొదటి నుంచి విచారణ ప్రారంభించాలని హైకోర్డు త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది.
సీజే ఏకే గోస్వామి, జస్టిస్ బాగ్చీ, జస్టిస్ జయసూర్య ధర్మాసనం ఈ విచారణ చేపట్టనుంది. అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరిపింది.
జస్టిస్ మహేశ్వరి బదిలీతో ఈ వ్యాజ్యాల పై విచారణ నిలిచిపోయింది. హైకోర్టు విడుదల చేసిన రోస్టర్‌లో శుక్రవారం త్రిసభ్య ధర్మాసనం విచారించింది.
అయితే రాజధాని భూములకు సంబంధించిన కేసుపై ఎప్పుడు విచారణకు షెడ్యూల్ ఖారారు చేయాలనే అంశంపై శుక్రవారం ప్రభుత్వం తరపు నుంచి అడ్వకేట్ జనరల్, ఇటు రైతుల తరపున వాదించే న్యాయవాదులతో చర్చించారు.
గతంలో ఈ కేసు సంబంధించి ఇటు రైతుల నుంచి అటు ప్రభుత్వం నుంచి దాదాపుగా వాదనలు పూర్తయ్యే దశలో అప్పటి చీఫ్ జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి బదిలి కావడంతో ఈ కేసులు విచారణ నిలిచిపోయింది.
అయితే ఇప్పుడు మళ్లీ మొదటి నుంచి వినేందుకు త్రిసభ్య ధర్మాసనం సిద్ధమైంది. ఈ కేసు విచారణ రెండు, మూడు నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది
తర్వాతి కథనం
