వైద్యం చేసి మానవత్వం చాటుకున్న తిరుపతి వైసిపి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి
ఈ రోజు ఉదయం 10 గంటలకు ఎన్నికల ప్రచారం కోసం వైఎస్సార్సీపీ తిరుపతి లోక్ సభ అభ్యర్థి డాక్టర్ మద్దిల గురుమూర్తి శ్రీకాళహస్తి వైపు కారులో వెళ్తుండగా.. రేణిగుంట మండలం వెదుళ్లుచెరువు గ్రామం వద్ద ద్విచక్రవాహనం ఢీకొట్టి సుమిత్ర అనే మహిళ కాలు విరిగి పడిపోయి వుంది.
ఈ ఘటనను గమనించి వాహనం దిగి ప్రాథమిక చికిత్స అందించి బాధితురాలికి దైర్యం చెప్పి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి దగ్గరుండి పంపించారు. ఆ తరువాత శ్రీకాళహస్తికి వెళ్ళారు.