1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. RK Roja asks farmers about issues, launched Rythu Bharosa Kendram

మీకేమైనా సమస్యలున్నాయా? రైతులను అడిగిన రోజా

RK Roja
చిత్తూరుజిల్లా నగరిలో రైతు భరోసా ప్రధాన గోదామును ప్రారంభించారు ఎమ్మెల్యే రోజా. రైతు రథాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఎంతో సంతోషంతో ఆమె రైతులతో మాట్లాడారు. మీకేమన్నా సమస్యలున్నాయా అంటూ ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. రైతు ప్రభుత్వంలో ఎలాంటి సమస్యలు లేవంటూ రైతులు చెప్పడంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు రోజా.
 
తన సొంత నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తున్నారు రోజా. లాక్ డౌన్ సమయంలో నిరుపేదలను ఆదుకున్న రోజా ఇప్పుడు రైతులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్రప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన నేపథ్యంలో నగరిలోను రైతు భరోసా కేంద్రానికి శ్రీకారం చుట్టారు రోజా.
 
రైతులకు తక్కువ ధరకే విత్తనాలను పంపిణీ చేయడానికి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు రోజా చెప్పారు. రైతులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సామాజిక దూరం పాటిస్తూ కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు. 
About Writer
జె
తర్వాతి కథనం
పోర్టులు, ఎయిర్ పోర్టుల అభివృద్ధికి డీపీఆర్ లు : ఆదాయ మార్గాలు, నిధుల సమీకరణపై అన్వేషణ