సంబంధిత వార్తలు
- అమరావతి వర్సెస్ మావిగన్- 2029 ఎన్నికల్లో ప్రత్యక్ష పోరు?
- పాదయాత్ర చేస్తా, మావిగన్ గురించి ప్రజలకు వివరిస్తా: జగన్ ప్రకటన
- 2029లో జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం వుంది.. ఉండవల్లి
- వైకాపా నేతల్లో మావిగన్ పిచ్చి ముదిరింది.. రాష్ట్రంపై పగబట్టారు : సీఎం చంద్రబాబు
- రోడ్డుకి అడ్డంగా వైఎస్సార్ విగ్రహాలు, తొలగిస్తున్న అధికారులు
కూటమి పార్టీలకు దత్తపుత్రికగా మారిన షర్మిలకు జగన్ గురించి మాట్లాడే అర్హత వుందా?
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై వైసీపీ నేత రోజా మండిపడ్డారు. కూటమి పార్టీలకు షర్మిల దత్తపుత్రికగా మారిపోయారని విమర్శలు గుప్పించారు. కోట్లాదిమంది దేవుడిగా పూజించే వైఎస్సార్ గారిని జీవితాంతం వ్యతిరేకించిన ఏపీ సీఎం చంద్రబాబుతో షర్మిల చేతులు కలిపిందని ఫైర్ అయ్యారు.
జాతీయ స్థాయిలో కూటమి పార్టీలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తే మీరు మాత్రం ఇక్కడ ఎందుకు చేతులు కలిపారో ప్రజలకు తెలియదనుకుంటున్నారా? అంటూ ప్రశ్నించారు. వైఎస్సార్ గారికి నిజమైన వారసుడు మా జగనన్నే అని ప్రజలు ఎప్పుడో నిర్ణయించారు.
రాష్ట్ర రాజకీయాలను, ప్రజల భవిష్యత్తును పేకాటగా చూస్తున్న మీకు రాజకీయ పరిణితి ఏ మాత్రం ఉందో అర్థమవుతోందని రోజా నిప్పులు చెరిగారు. కూటమి నాయకులకు సలాం కొడుతున్న షర్మిలకు వైకాపా అధినేత జగన్ గురించి మాట్లాడే అర్హత వుందా అంటూ సూటిగా ప్రశ్నించారు.
