1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. RTC Strike : Telangana govt extend Dussehra holidays

తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె ఎఫెక్టు : 19 వరకు సెలవులు పొడగింపు

RTC Strike
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు కార్మికుల సమ్మె కొనసాగుతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. రవాణా అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ... అవి ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వలేక పోయాయి. 
 
ఈ నేపథ్యంలో, విద్యాసంస్థలకు దసరా సెలవులను మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 19 వరకు సెలవులు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి అక్టోబరు 14 నుంచి తెలంగాణలో పాఠశాలలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ సమ్మె కొనసాగుతుండడంతో 15వ తేదీ వరకు సెలవులు పొడిగించారు. 
 
కానీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో మరోసారి సెలవులు పొడిగించక తప్పలేదు. ఈ నేపథ్యంలో, అదనపు బస్సులు సమకూర్చుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కాగా, ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తర్వాత ఆయన సెలవులను పొడగించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
'మహా' సంగ్రామం.. రూ.10కే భోజనం... ఆసక్తి రేపుతున్న శివసేన మేనిఫెస్టో