1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Sajjala Ramakrishna Reddy Sensational comments on TDP Recognition

తెలుగుదేశం పార్టీ గుర్తింపు రుద్దు చేయాలని ఫిర్యాదు చేస్తాం : సజ్జల

Sajjala Ramakrishna Reddy
తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల గోపాలకృష్ణారెడ్డి వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఈసీకి ఫిర్యాదు చేస్తాం. టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలను టీడీపీ నేతలే సమర్థించడం లేదు. టీడీపీ నేతలు ఎన్నిసార్లు దూషించినా మౌనంగానే ఉన్నాం. ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాం.. వీధి రాజకీయాలు చేయడానికి కాదు. సహానానికి  హద్దు ఉంటుంది అని ఘాటుగా వ్యాఖ్యానించారు. 
 
అంతేకాకుడా, చంద్రబాబు చేసే దీక్షలకు పట్టుమని పది మంది కూడా స్పందించడంలేదు. బూతులు తిట్టడం అనేది చేతగానివాళ్లు చేసే పని. సీఎం వైయ‌స్‌ జగన్‌ సంయమనం పాటించాలని చెప్పారు. అందుకే మా కార్యకర్తలు సహనంగా ఉన్నారు. తల్లుల గురించి ఎవరైనా అవమానకరంగా మాట్లాడతారా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు చేసే దీక్ష చూస్తే నవ్వాలో.. ఏడ్వాలో అర్థం కావడం లేదు పట్టాభి వ్యాఖ్యలను టీడీపీ నేతలే సమర్థించడం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సీఎంను దూషించడం సరికాదని సజ్జల గోపాలకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
న్యాయ పోరాటంలో గెలిచిన 39 మంది మహిళా ఆఫీసర్లు