1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 అక్టోబరు 2021 (11:59 IST)

టీడీపీలో చేరిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నట్టుండి ఒక ఆశ్చర్యకర సంఘటన జరిగింది. ఏపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికార పార్టీ ప్రతినిధి జీవీ రెడ్డి ఉన్నట్టుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. 
 
ఆ పార్టీ అధినేత చంద్రబాబు బుధవారం సాయంత్రం ఇక్కడ తన నివాసంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికి పార్టీలో చేర్చుకొన్నారు. తనను చేర్చుకొన్నందుకు చంద్రబాబుకు జీవీ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.  
 
క్రీయాశీలక పార్టీలో చేరాలనే నిర్ణయంతో టీడీపీలో చేరినట్లు జీవిరెడ్డి తెలిపారు. తనను చేర్చుకున్నందుకు చంద్రబాబుకు జీవీ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి మరింత నష్టం చేకూరవద్దంటే చంద్రబాబును బలపర్చాల్సిన అవసరం ఉందన్నారు. 
 
విజన్ లేకుండా నిధులు పప్పు బెల్లాలు పంచినట్టు పంచితే భవిష్యత్ ఆగమ్యగోచరంగా ఉంటుందన్నారు. చంద్రబాబు అభివృద్ధి కోరుకునే వ్యక్తి అయితే.. జగన్ వినాశనం కోరుకునే వ్యక్తి అని విమర్శించారు. కొన్ని వర్గాలు చంద్రబాబుపై అకారణంగా ద్వేషం పెంచుకోవడం వల్ల రాష్ట్రం నాశనమైందని అభిప్రాయపడ్డారు.