గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 అక్టోబరు 2021 (19:34 IST)

సజ్జల ఒక బ్రోకర్.. ఆయనకు సమాధానం చెప్పాలా? లోకేశ్ ప్రశ్న

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఒక బ్రోకర్ ఆయన వ్యాఖ్యలకు తాను సమాధానం చెప్పాలా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. బోసడీకే అనే పదాన్ని గూగుల్‌లో సెర్చ్ చేస్తే తెలుస్తుందని ఆయన సూచించారు. బోసడీకే అనే పదం తప్పుకాదని తమ పార్టీ నేత పట్టాభి వ్యాఖ్యలను లోకేశ్ సమర్థించారు. పట్టాభి ఇంటిపై దాడి చేసిన వారిపై కేసులు ఎందుకు పెట్టరని ప్రశ్నించారు. 
 
టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతల దాడి ఘటనపై లోకేశ్ తీవ్రంగా స్పందించారు. మా ఓర్పు, సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు. తాము అధికారంలో వస్తే వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. కొందరు పోలీస్ అధికారుల తీరుపై కూడా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
వాళ్ల వల్ల మొత్తం ఏపీ పోలీసులకు చెడ్డ పేరుతో వస్తుందన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి జరిగి 24 గంటలు అవుతున్నా ఒక్కర్నీ కూడా అరెస్ట్ చేయలేదన్నారు. వైసీపీ నేతలు దాడి చేసినప్పుడు రికార్డైన సీసీ ఫుటేజ్‌ను డీజీపీకి అందజేసినా ఇప్పటివరకూ నిందితులను అరెస్ట్ చేయకపోవడం శోఛనీయమని లోకేశ్ వ్యాఖ్యానించారు. 
 
టీడీపీ హయాంలో జగన్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా నారా లోకేశ్ సూటిగా ప్రశ్నించారు. నడి వీధిలో చంద్రబాబును కాల్చి చంపాలనే జగన్ వ్యాఖ్యలను లోకేశ్ గుర్తుచేశారు. చంద్రబాబును బంగాళాఖాతంలో కలపాలని జగన్ అన్నారా? లేదా అనే దానిపై చెప్పాలని లోకేశ్ డిమాండ్ చేశారు. ‘ముఖ్యకంత్రిని జైల్లో పెట్టి తన్నాలి’ అని జగన్ అనలేదా? అని ఆయన ప్రశ్నించారు.