గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 20 అక్టోబరు 2021 (19:21 IST)

నారా లోకేష్‌ పప్పు, కూరగాయలు అమ్ముకోవాల్సిందే: వల్లభనేని సంచలన వ్యాఖ్యలు

వ్యవస్ధీకృత నేరాలకు అధ్యక్షుడు చంద్రబాబునాయుడు. ఎన్టీఆర్‌ను వెన్ను పోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. మేకతోలు కట్టుకున్న గుంటనక్క చంద్రబాబు. ప్రజాస్వామ్యంలో ప్రస్తుతం నడుస్తున్న వాతావరణం సరైంది కాదు. ఘర్షణ వాతావరణం సరైంది కాదంటున్నారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. 
 
చాలారోజుల తరువాత మీడియా ముందుకు వచ్చిన వంశీ టిడిపి అధినేత, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్సి నారా లోకేష్‌ లపై నిప్పులు చెరిగారు. మీటర్, మోటార్, మేటర్ లేని వ్యక్తి నారా లోకేష్‌. దద్దమ్మ, సన్యాసి లోకేష్. 74 యేళ్ళ వయస్సుల్లో చంద్రబాబు ఉంటూ కుమారుడిని ఎలాగైనా ముఖ్యమంత్రి చేయాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. లోకేష్‌ను చూసి చంద్రబాబు బాధపడుతున్నారని.. అందుకే ఏదో ఒకటి చేయాలని ఇలాంటి పనులు చేస్తున్నట్లు విమర్సించారు.
 
చంద్రబాబు, నారా లోకేష్‌‌ల గురించి ప్రజలు బాగా తెలుసుకున్నారని.. వారేంటో అందరికీ అర్థమైందన్నారు. చంద్రబాబు మరో మూడు, నాలుగేళ్ళు మాత్రమే బతుకుతారని.. ఆ తరువాత నారా లోకేష్‌ పప్పు, కూరగాయలు అమ్ముకోవాలే తప్ప రాజకీయాలు చేయలేరన్నారు. వంశీ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు టిడిపి నేతలు.