గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 అక్టోబరు 2021 (14:55 IST)

టీడీపీ నేత నారా లోకేష్‌పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు : డీజీవీ గౌతం సవాంగ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై ఏపీ పోలీసులు ఎస్సీఎస్టీ కేసు నమోదైంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చిన సీఐ నాయక్‌పై దాడి చేశారంటూ మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఈ కేసులో లోకేశ్‌ను ఏ1గా, అశోక్ బాబును ఏ2గా, ఆలపాటి రాజాను ఏ3గా, తెనాలి శ్రవణ్‌ను ఏ4గా, పోతినేని శ్రీనివాసరావును ఏ5గా పేర్కొన్నారు. వీరితో పాటు మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. వీరందరిపై హత్యాయత్నం సహా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. 
 
టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన తర్వాత అక్కడకు సీఐ నాయక్ వచ్చారని... ఈ సందర్భంగా నారా లోకేశ్ సహా పలువురు దాడి చేసినట్టు ఆరోపణలు వచ్చాయని, ఈ నేపథ్యంలో హత్యాయత్నం కేసులు నమోదు చేశామని ఆయన బుధవారం మీడియాకు వెల్లడించారు.
 
మరోవైపు ఏపీలోని టీడీపీ నేతలు, కార్యాలయాలపై వైకాపా శ్రేణులు చేసిన దాడులు వైకాపా ఎంపీ మోపిదేవి వెంకటరమణ సమర్థించారు. వైసీపీ శ్రేణుల దాడులు సరైనవే అని అన్నారు. టీడీపీ బాష అలా ఉంటే వైసీపీ ప్రతి చర్య ఇలానే ఉంటుందని తెలిపా
 
రాజకీయ చరిత్రలో నిన్నటి రోజు ఓ దుర్దినమన్నారు. ప్రతిపక్ష పార్టీలకు తమ ఉనికి కోల్పోతుందని భయం పట్టుకుందన్నారు. భయంతోనే పెయిడ్ ఆర్టిస్ట్ పట్టాభి లాంటి వారితో ఇష్టానుసారంగా మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. పట్టాభి మాట్లాడే బాష వింటుంటే రక్తం మరిగిపోతుందని మోపిదేవి అన్నారు.