శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

20-10-2021 బుధవారం దినఫలాలు .. మహావిష్ణువును ఆరాధించిన...

మేషం :- వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు, పథకాలు స్ఫురిస్తాయి. రావలసిన ధనం చేతికందటంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరగలదు. ఉద్యోగస్తుల శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ మంచితనం, మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. పెద్దల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు.
 
వృషభం :- ఉపాధ్యాయులు విద్యార్థుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. వ్యాపారాలు, లీజు, ఏజెన్సీ, కాంట్రాక్టులకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. రుణం ఏ కొంతైనా తీర్చలన్న మీ లక్ష్యం నెరవేరుతుంది. స్త్రీలు విదేశీ వస్తువులపట్ల ఆకర్షితులవుతారు.
 
మిథునం :- ఆర్థికంగా పురోభివృద్ధి సాధించే యత్నాలు అనుకూలిస్తాయి. మీ కుటుంబీకులతో కలసి ఆలయాలను సందర్శిస్తారు. రాజకీయ, కళారంగాల్లో వారు సన్మానాలు పొందుతారు. రిప్రజెంటిమ్‌కు శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యం అవసరం.
 
కర్కాటకం :- స్త్రీలు సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ ఆలోచనలు పంచుకునే వారి కోసం మనసు తహతహలాడుతుంది. మీ ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చించవలసి ఉంటుంది.
 
సింహం :- విదేశాలు వెళ్ళాలనే మీ కొరిక త్వరలోనే నెరవేరబోతోంది. ఉద్యోగస్తులకు అధికారిక పర్యటనలు, బాధ్యతలు అధికమవుతాయి. చిన్నతరహా పరిశ్రమలు, ప్రింటింగ్ రంగాల వారికి సమస్యలు తప్పవు. పనులకు ఆటంకాలు కల్పించాలనుకున్నవారు సైతం అనుకూలంగా మారతారు. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి.
 
కన్య :- వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో రాణిస్తారు. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. కీలకమైన సమావేశాల్లో మితంగా సంభాషించండి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు తాత్కాలికమేనని గమనించి శ్రమించండి అనుకున్నది సాధిస్తారు. రుణం కొంత మొత్తం తీర్చటంతో ఒత్తిడి నుండి కుదుటపడతారు.
 
తుల :- మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. ఖర్చులు అదుపు చేయటం కష్టం. అనుకున్నది సాధించాలి అనే పట్టుదల పెరుగుతుంది. మీ మాటకు ఇంటా, బయటా ఆమోదం లభిస్తుంది. సాహస ప్రయత్నాలు విరమించండి.
 
వృశ్చికం :- వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో రాణిస్తారు. కుటుంబీకుల మధ్య అవగాహన అంతగా ఉండదు. ఆత్మీయుల నుంచి అందిన ఆహ్వానాలు స్త్రీలకు సంతోషం కలిగిస్తాయి. మీ ఉన్నతిని చాటుకోవాలనే ఉద్దేశ్యంతో ధనం విరివిగా వ్యయం చేస్తారు. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
 
ధనస్సు :- ఉద్యోగస్తులు ప్రతి విషయంలోను అత్యంత జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. పాత మిత్రుల కలయికతో కొత్త ఉత్సాహానికి గురవుతారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండి లక్ష్య సాధనకు మరింతగా కృషి చేయవలసి వుంటుంది. మీ భర్తలో మీరు కోరుకునే మార్పులు నిదానంగా అనుకూలిస్తాయి.
 
మకరం :- ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు వారి పురోగతికి ఉపకరిస్తుంది. పత్రికా రంగంలోని వారి యత్నాలకు తగు ప్రోత్సాహం లేకపోవటంతో ఆసక్తి సన్నగిల్లుతుంది. వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి నిరంతర శ్రమ, ఓర్పు ఎంతో ముఖ్యం. స్త్రీలకు దూర ప్రయాణాలలో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
 
కుంభం :- గృహోపకరణాలు, వాహనం వంటి విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. చిట్స్, ఫైనాన్సు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ప్రతి విషయంలోను నిర్మొహమాటంగా మీ అభిప్రాయాలు తెలియచేయండి. ప్రముఖుల సహకారంతో ఒక వ్యవహారం సానుకూలమవుతుంది.
 
మీనం :- ఆర్థికంగా బాగున్నా మానసిక ప్రశాంతత అంతగా ఉండదు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల విమర్శలు తప్పవు. ప్రేమ వ్యవహరాల్లో ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. దైవ దర్శనాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ రీతా దూరప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తిచేస్తారు.