గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

18-10-2021 సోమవారం దినఫలాలు .. శంఖరుడిని పూజించినా..

మేషం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారు ఓర్పు, అంకితభావంతో పనిచేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి పెరుగుతుంది. బ్యాంకింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. నిరుద్యోగులకు మధ్యవర్తుల పట్ల అప్రమత్తత చాలా అవసరం. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు.
 
వృషభం :- ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలు, కార్యాలయ పనులతో హడావుడిగా గడుపుతారు. పెద్దల ఆరోగ్యము గురించి సంతృప్తి కానవస్తుంది. సాంకేతిక రంగంలోని వారికి గుర్తింపు లభిస్తుంది. భాగస్వామిక, సొంత వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. అదనపు ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తారు.
 
మిథునం :- వస్త్ర, ఫ్యాన్సీ, పచారి, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. స్త్రీలు ఎదుటివారిని అతిగా విశ్వసించటం మంచిది కాదు. ప్రేమికుల వ్యవహారం సమస్యాత్మకమవుతుంది. వస్తువుల పట్ల ఆపేక్ష అధికమవుతుంది. ఇంతకాలం పడిన శ్రమఫలిస్తుంది. చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి.
 
కర్కాటకం :- మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచటం మంచిది. ప్రముఖులను కలుసుకుంటారు. స్వార్ధపూరిత ప్రయోజనాలు ఆశించి మీకు చేరువవ్వాలని భావిస్తున్న వారిని దూరంగా ఉంచండి. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి. బేకరి, తినుబండారాల వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.
 
సింహం :- స్త్రీలకు టి.వి. ఛానెళ్ళ కార్యక్రమాల సమాచారం అందుతుంది. నిరుద్యోగులు వచ్చిన తాత్కాలిక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం శ్రేయస్కరం. ఖర్చులు అధికమవుతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాలు, వాణిజ్య ఒప్పందాల్లో మెళకువ వహించండి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు.
 
కన్య :- గృహంలో చికాకులు తొలగి ప్రశాంతత నెలకొంటుంది. వ్యాపారాల్లో ఒక నష్టాన్ని మరోవిధంగా భర్తీ చేసుకుంటారు. ఒకానొక వ్యవహారంలో మిత్రుల మాటతీరు మనస్తాపం కలిగిస్తుంది. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.
 
తుల :- మీ సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. విదేశాలు వెళ్ళాలనే మీ ఆలోచన క్రియారూపంలో పెట్టినట్లయితే జయం చేకూరుతుంది. స్త్రీలకు ప్రకృతి, వైద్య, ఆయుర్వేద రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిని ఇస్తాయి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూల మార్గంలో నడుస్తాయి.
 
వృశ్చికం :- మీడియా రంగాల్లో వారికి పనిభారం అధికం అవుతుంది. బంధువులతో మనస్పర్థలు తలెత్తుతాయి. ప్రభుత్వరంగాల్లో వారికి స్వల్ప వివాదాలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. విద్యార్థులు రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార సంస్థల్లో సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి.
 
ధనస్సు :- కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ రంగాల వారి నుంచి ఒత్తిడి పెరుగుతుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. ప్రైవేటు రంగాల వారికి చికాకులు అధికం. వస్త్ర ఫ్యాన్సీ, స్టేషనరీ, పాదరక్షల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విందులు, వినోదాలు, సమావేశాలు ఉల్లాసం కలిగిస్తాయి.
 
మకరం :- ముఖ్యుల కోసం షాపింగ్ చేస్తారు. సోదరుడు లేక సోదరి మొండి వైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. పెద్దమొత్తం ధనంతో ప్రయాణాలు క్షేమంకాదని గమనించండి. బంధువుల గురించి ప్రియమైన వార్తలు వినవలసివస్తుంది. నిరుద్యోగులు వచ్చిన తాత్కాలిక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం శ్రేయస్కరం.
 
కుంభం :- ఉద్యోగయత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం కూడదు. పరస్పరం విలువైన కానుకలిచ్చి పుచ్చుకుంటారు. వ్యాపారాల్లో ఒక నష్టాన్ని మరో విధంగా భర్తీ చేసుకుంటారు. రావలసిన ధనం చేతికందడంతో ఖర్చులు అధికమవుతాయి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాల్లో అతిగా వ్యవహరించి వివాదాలు కొని తెచ్చుకుంటారు.
 
మీనం :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. ఉద్యోగస్తుల ప్రమోషన్‌కు కొంతమంది అడ్డుతగులుతారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. మిత్రులను కలుసుకుంటారు. రాజకీయ నాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు.