బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

14-10-21 గురువారం దినఫలాలు

Astrology
మేషం :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ప్రయాణాలలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపకాలు అధికమవుతాయి. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఒక స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం. 
 
వృషభం :- మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. గృహంలో మార్పులు, మరమ్మతులు చేపడతారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది.
 
మిథనం :- శ్రీమతి సలహా పాటించటంవల్ల ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. బంధువులను కలుసుకుంటారు. కాంట్రాక్టర్లకు మంచి మంచి అవకాశాలు లభించిన సద్వినియోగం చేసుకోలేరు. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు.
 
కర్కాటకం :- ఆర్థికంగా మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి రాగలవు. సోదరీ, సోదరులతో విబేధాలు తలెత్తుతాయి. నిత్యావసర వస్తు స్టాకిస్టులు, వ్యాపారులకు కలిసిరాగలదు. ఇతరులపై ఆధారపడక మీ పనులు మీరే చేసుకోవటం క్షేమదాయకం. కోర్టు వ్యవహారాలు ఒక పట్టాన తేలకపోవటంతో అసహనం తప్పదు.
 
సింహం :- వృత్తిపరంగా ఎదురైన ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్, ఆటోమొబైల్ రంగాల వారికి పని భారం అధికంగా ఉంటుంది. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభదాయకం. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆత్మీయుల పలకరింపు, ఓదార్పునిస్తుంది.
 
కన్య :- ప్రైవేటు సంస్థల్లో వారికి సదవశాలు లభిస్తాయి. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. ఎల్.ఐ.సి, పోస్టల్ ఏజెంట్లకు ఒత్తిడి పెరుగుతుంది. మీ వాక్ చాతుర్యానికి, మంచి తనానికి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు, ఇతరత్రా వికాకులు అధికం.
 
తుల :- బకాయిలు, ఇంటి అద్దెల వసూలులో సౌమ్యంగా మెలగాలి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, ఆదనపు బాధ్యతలు పనిభారం వంటి చికాకులు తప్పవు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. మీ ప్రియతముల కోసం పిల్లల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు.
 
వృశ్చికం :- అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. పట్టుదలతో ముందుకు సాగి ఎంతటి కార్యానైనా సాధిస్తారు. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు చికాకులు తప్పవు. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు ఏకాగ్రత వెలా అవసరం. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. రుణయత్నాలు, చేబదుళ్ళు తప్పవు.
 
ధనస్సు :- కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. నిరుద్యోగులకు అవకాశాలు లభించినప్పటికి వాటిని సద్వినియోగించుకోలేకపోతారు. వాతావరణంలో మార్పు చికాకు కలిగిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. స్త్రీలు అదనపు సంపాదన దిశగా ఆలోచనలు చేస్తారు.
 
మకరం :- మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగకుండా వ్యవహరించండి. ఓర్పు, పట్టుదలతో శ్రమించినగాని చేపట్టిన పనులు పూర్తి కావు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఆడిటర్లకు అకౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికంగా ఉంటుంది. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలుపైకి వస్తాయి.
 
కుంభం :- ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. అనుక్షణం మీ సంతానం విద్యా, ఉద్యోగ విషయాలపైనే మీ ఆలోచనలుంటాయి. వ్యాపారాల్లో పోటీతనం ఆందోళన కలిగిస్తుంది. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ ఏకాగ్రత చాలా అవసరం.
 
మీనం :- అధికారుల హోదా పెరగటంతో పాటు స్థానమార్పిడికి అవకాశం ఉంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సాహస ప్రయత్నాలు విరమించండి. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి నూతన ఆలోచనలు స్ఫురించగలవు.