బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

09-10-2021 శనివారం దినఫలాలు .. అమ్మ వారిని ఆరాధించిన...

మేషం :- భాగస్వామ్యుల మధ్య ఎదుటివారి కారణంగా ఆపోహలు తలెత్తగలవు. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. సాహస ప్రయత్నాలు విరమించండి. స్త్రీలకు నరాలకు సంబంధించిన చికాకులు అధికవుతాయి. వస్తువుల పట్ల ఆపేక్ష అధికమవుతుంది. బంధువులతో మనస్పర్థలు తలెత్తుతాయి.
 
వృషభం :- విద్యుత్ లోపం వల్ల గృహం లేక వ్యాపార సంస్థల్లో సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. బంధువుల ఆకస్మిక రాకతో ఖర్చులు అధికమవుతాయి. చర్మానికి సంబంధించిన చికాకులు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. తలపెట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది.
 
మిథునం : - కొంతమంది మీ మీద అపవాదులు వేయటానికి ప్రయత్నిస్తారు జాగ్రత్త వహించండి. మీ సోదరుడు లేక సోదరి మొండి వైఖరి మీకెంతో చికాకు, ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. గణిత, కంప్యూటర్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి అనుకోని గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
కర్కాటకం : - పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. రచయితలకు, పత్రికారంగాల్లో వారికి, మీడియా రంగాల్లో వారికి శ్రమాధిక్యత అధికమవుతుంది. ఒకానొక వ్యవహారంలో మిత్రుల మాటతీరు మనస్తాపం కలిగిస్తుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు, లభిస్తుంది. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది.
 
సింహం :- తలపెట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులకు సంబంధించి ప్రముఖులతో చర్చలు జరుపుతారు. కొంతమంది మీ మీద అపవాదులు వేయటానికి ప్రయత్నిస్తారు. జాగ్రత్త వహించండి. మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. బంధువుల రాకతో ఖర్చులు అధికం
 
కన్య : - పారిశ్రామిక రంగంలో వారికి పనిభారం అధికమవుతుంది. స్త్రీలకు ప్రకృతి, వైద్య, ఆయుర్వేద రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ సంతానం మొండితనం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఎటువంటి అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది.
 
తుల :- కుటుంబంలోను, సంఘంలోను అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. విందులు, వినోదాలు, సమావేశాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఐ.టి. రంగాల్లో వారికి పనిభారం, ఒత్తిడి, చికాకు అధికమవుతాయి. స్థిరాస్తుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నూతన వ్యాపారాల పట్ల ఆసక్తి పెరిగిన ఆచి, తూచి వ్యవహరించడం మంచిది.
 
వృశ్చికం : - భాగస్వామ్యుల మధ్య ఎదుటివారి కారణంగా అపోహలు తలెత్తగలవు. రాజకీయాల్లో వారికి ఒత్తిడి, సమస్యలు అధికం అయినా తేలికగా పరిష్కరిస్తారు. విదేశాలు వెళ్ళాలనే మీ ఆలోచన క్రియారూపంలో పెట్టినట్లయితే జయం చేకూరుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది.
 
ధనస్సు :- సంగీత, సాహిత్య, కళా రంగాల్లో వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఎదుటివారిలో తప్పులను వెదికే ప్రయత్నాలను విరమించండి. మీడియా రంగాల్లో వారికి పనిభారం అధికం అవుతుంది. ధనం రాకడ, ధనం పోకడ సరిసమానంగా ఉండటంవల్ల మానసిక ఒత్తిడికి లోనవుతారు. వివాహ వ్యవహారాదుల్లో మెళకువ వహించండి.
 
మకరం :- ప్రభుత్వ రంగాల్లో వారికి స్వల్ప వివాదాలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. రాజకీయ, సినీ కళారంగాల్లో వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు విదేశీ చదువులకు మార్గం సుగమమవుతుంది. యాధృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. సమావేశానికి ఏర్పట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
 
కుంభం :- చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. బంగారం, వెండి వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దుస్వప్నాలు మీకెంతో చికాకు, ఆందోళనలు తప్పవు. రిప్రజెంటివ్‌లు నిర్దేశించబడిన గమ్యానికి చేరలేకపోవడం వల్ల ఇబ్బందులకు లోనవుతారు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు.
 
మీనం :- మీ పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఒక్కోసారి మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. పాత సమస్యలను తేలికగా పరిష్కరిస్తారు. రహస్య విరోధులు అధికం కావడంవల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. రావలసిన బకాయిలు కొంతముందు వెనుకలుగానైనా మీకు అందగలవు.