బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : బుధవారం, 6 అక్టోబరు 2021 (09:16 IST)

06-10-2021 బుధవారం రాశిఫలాలు : లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన

06-10-2021 బుధవారం. శ్రీ ప్లవనామ సం|| భాద్రపద అమావాస్య సా.5.09 హస్త రా.1.11 ఉ.వ.10.04 ల 11.37, పదు.11.25 ల 1212 
 
మేషం:- అరుదైన శస్త్రచికిత్సలను డాక్టర్లు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్త్రీలకు కాళ్లు, తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు పునఃప్రారభమవుతాయి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. విదేశీయానం, రుణ యత్నాలు ఫలిస్తాయి.
 
వృషభం:- కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మికంగా ప్రయాణాలు విరమించుకుంటారు. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు ఏకాగ్రత ముఖ్యం. రుణం తీర్చటంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు. ముందుచూపుతో వ్యవహరించుట మంచిది.
 
మిధునం:- ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఉద్యోగస్తులు ఏకాగ్రత, మెళుకువ ఎంతో ముఖ్యం. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు.
 
కర్కాటకం:- ఎంతటి పనినైనా పట్టుదలతో పూర్తిచేస్తారు. షాపులలో పనిచేసే వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి. ప్రభుత్వాని చెల్లించాల్సిన టాక్సులు, ఇతరత్రా చెల్లింపులు జరుపుతారు. వాహనచోదకులకు ఊహించని చికాకులు ఎదురవుతాయి.
 
సింహం:- తల, ఎముకలకి సంబంధించిన చికాకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోగలవు. వాహనం ఇతరులకు ఇచ్చి సమస్యలను తెచ్చుకుంటారు. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి ఆశాజనకం. ఉద్యోగస్తులకు మందలింపులతో పాటు మంచి గుర్తింపు లభిస్తుంది.
 
కన్య:- అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. దూర ప్రయాణాల్లో అసౌకర్యానికి గురవుతారు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన మంచిది. పెద్దల వ్యవహారాలలో జోక్యం చేసుకోవటం వల్ల విమర్శలు తప్పవు. విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది.
 
తుల:- ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. స్త్రీలు షాపింగ్‌ల కోసం ధనం ఖర్చుచేస్తారు. వాతావరణంలోని మార్పు వ్యవసాయదారులకు ఆందోళన కలిగిస్తుంది. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు లాభసాటిగా సాగుతాయి. 
 
వృశ్చికం:- స్టేషనరీ, ప్రింటింగు రంగాల్లో వారికి నూతన ఆలోచనలు స్ఫురించగలవు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికమవుతాయి. పెద్దల ఆరోగ్యములో మెళుకువ అవసరం. రేపటి కార్యక్రమాల గురించి ఈ రోజే ఆలోచించి క్రియారూపంలో పెట్టండి. వైద్యులు శస్త్రచికిత్స చేయునపుడు మెళుకువ, ఏకాగ్రత అవసరం.
 
ధనస్సు:- రావలసిన ధనం అందడంతో మీలో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. స్త్రీల ప్రతిభకు గుర్తింపు, సదవకాశాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలసి ఆలయాలను సందర్శిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు, క్రయ విక్రయాల లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు.
 
మకరం:- ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. విద్యార్థుల అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులు, స్వల్ప నష్టాలు ఎదుర్కుంటారు. కళా సాంస్కృతిక రంగాల వారు లక్ష్య సాధనకు శ్రమించాలి. తొందరపాటు నిర్ణయాలవల్ల ఒక్కొసారి మాటపడవలసి వస్తుంది.
 
కుంభం:- విద్యుత్ రంగాల వారికి పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్న పనులు పూర్తిచేస్తారు. పెద్దమొత్తంలో ధనసహాయం మంచిది కాదు. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది.
 
మీనం:- మీపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యల ప్రభావం అధికం. స్థిర, చరాస్తుల యత్నాలు ఒక కొలిక్కి రాగలవు. ఆత్మవిశ్వసం రెట్టింపవుతుంది. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. తమ మాటే నెగ్గాలన్న పంతం ఇరువురికి తగదు. వ్యాపారాల్లో పోటీ, షాపు పనివారల నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తాయి.