శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By ఠాగూర్

5-10-2021 మంగళవారం రాశిఫలాలు - ఆంజనేయస్వామిని తమలపాకులతో...

శ్రీ ప్లవనామ సంII చతుర్దశి రా.6.27 ఉత్తర రా.1.56 ఉ.వ. 9.22 ల 10.57. ఉ.దు.8.16 ల 9.03, రా.దు. 10.36 ల 11.25. 
 
మేషం:- బ్యాంకు వ్యవహారాలు సజావుగా సాగుతాయి. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. కళ, క్రీడ, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. దంపతుల మధ్య ఏకాగ్రత లోపం అధికమవుతుంది. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది.
 
వృషభం:- ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. ఎడుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయటం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మీ సంతానం కోసం ధనం బాగుగా వ్యయం చేస్తారు.
 
మిథునం:- స్త్రీలకు పనివారాలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. బంధు మిత్రులతో పట్టింపు లెదుర్కొంటారు. నిర్మాణ కార్యక్రమాలలో ప్రోత్సాహం కానవస్తుంది. కళాకారులకు, రచయితలకు, పత్రికా రంగంలో వారికి అనుకూలమైన కాలం. సాహస ప్రయత్నాలు విరమించండి. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు.
 
కర్కాటకం:- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను చేపడతారు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. మీ సహాయం పొంది మీ మీద అభాండాలు వేసేవారు అధికం అవుతున్నారని గమనించండి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
 
సింహం:- బంధువుల రాకపోకలు సంతోషాన్ని కలిగిస్తాయి. దైవ కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. భాగస్వామిక వ్యాపారాల్లో ఆధిపత్యానికి భంగం కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బందులు కలిగిస్తాయి. సోదరీ, సోదరులతో కలయిక, పరస్పర అవగాహన కుదురును.
 
కన్య:- ఉద్యోగస్తులపై అధికారుల మన్ననలను పొందగలుగుతారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుని వ్యవహారాలు చక్కదిద్దుతారు. బంగారు, వెండి, లోహ రంగాలలో వారికి మందకొడిగా వుండగలదు. దంపతుల మధ్య అనురాగ వాత్యాల్యాలు పెంపొందుతాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
తుల:- ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. రాజకీయ పార్టీవారితో సమస్యలు ఎదుర్కొంటారు. జాగ్రత్త వహించండి. రావలసిన బకాయిలు సకాలంలో అందుతాయి. ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు సంభవిస్తాయి. డాక్టర్లకు నిరుత్సాహం కానవస్తుంది. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
వృశ్చికం:- పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. ఒక ప్రకటన మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారులతో అవగాహనలోపం, తోటివారి సహకారం లభిస్తుంది. మీ పాత సమస్యలు పరిష్కారం కాకపోవటంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు.
 
ధనస్సు:- విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. మధ్యవర్తిత్వం వహించడంవలన మాటపడక తప్పదు. విద్యార్థుల ఆలోచనల పక్కదోవ పట్టే ఆస్కారం ఉంది. స్త్రీలు షాపింగ్ కోసం ధనం ఖర్చుచేస్తారు. ఉద్యోగస్తులు అధికారులతో పర్యటనలు, పర్యవేక్షణలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అనవసరం.
 
మకరం:- తల, ఎముకలకి సంబంధించిన చికాకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోగలవు. ఉద్యోగస్తులు శక్తివంచన లేకుండా శ్రమించి అధికారులను మెప్పిస్తారు. వ్యాపార రంగాలలో వారికి గణనీయమైన అభివృద్ధి. ఎదన్నా అమ్మకానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. మిమ్మల్ని హేళన చేసేవారు మీ సహాయాన్ని ఆర్జిస్తారు.
 
కుంభం:- ముందుచూపుతో వ్యవహరించుట మంచిది. రాజకీయాలలోని వారికి రహస్యపు విరోధులు అధికమవుతున్నారు అని గమనించండి. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. మీ బాధ్యతలను మిత్రులకు అప్పగించటం మంచిదికాదు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతతాయి.
 
మీనం:- ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి. మీ ఆంతరంగిక సమస్యలకు నెమ్మదిగా పరిష్కారమార్గం కానరాగలదు. రేపటి కార్యక్రమాల గురించి ఈ రోజే ఆలోచించి క్రియారూపంలో పెట్టండి.