బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

శనివారం దినఫలాలు - రమాసమేత సత్యనారాయణస్వామిని ఆరాధించిన...

మేషం:- ఉద్యోగస్తులు అధికారులతో పర్యటనలు, పర్యవేక్షణలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అనవసరం. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. చిన్ననాటి వ్యక్తులను కలుసుకుంటారు. నూతన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది.
 
వృషభం:- ఆర్థికస్థితి కొంత మేరకు మెరుగుపడుతుంది. దైవకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలు ఆలంకారాలు, విలాసవస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. దాంపత్య సుఖం, మానసిక ప్రశాంతత చేకూరుతాయి. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. మీ బాధ్యతలు ఇతరులకు అప్పగించటం మంచిదికాదు.
 
మిధునం:- విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి పెరుగుతుంది. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగలు చేపట్టిన ఉపాధి పథకాలకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది. స్త్రీలు షాపింగ్‍‌ల కోసం ధనం ఖర్చుచేస్తారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది.
 
కర్కాటకం:- బంధువుల నుంచి మనస్పర్థలు తలెత్తుతాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మధ్యవర్తిత్వాలు, వివాదాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. సంఘంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుంది.
 
సింహం:- రిప్రజెంటటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టంమీద ఆలస్యముగానైనా పూర్తి చేస్తారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగుమెళుకువ అవసరం. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఆకస్మికంగా ఆరోగ్యపమైన సమస్యలు తలెత్తుతాయి.
 
కన్య:- హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. మిత్రుల కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. పుణ్యక్షేత్రాల దర్శనంవల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం.
 
తుల:- కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. పరస్త్రీలతో అధికంగా సంభాషించడం మంచిది కాదు. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యతే గాని ఆర్థికస్థితి ఆశించినంత సంతృప్తికరంగా ఉండదు. మీ చిన్నారుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. విద్యార్థులు ప్రేమ వ్యవహరాల్లో పెద్దల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు.
 
వృశ్చికం:- స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. వ్యాపారాభివృద్ధికి కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. బంగారు, వెండి, లోహ రంగాలలో వారికి మందకొడిగా వుండగలదు. బంధు మిత్రులతో కలసి ఆలయాలను సందర్శిస్తారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి.
 
ధనస్సు:- విందులలో పరిమితి పాటించడం చాలా అవసరం. విలువైన కానుకలందించి ప్రముఖులను ఆకట్టుకుంటారు. విద్యార్థులు క్రీడలు, క్విజ్ ఇతర పోటీల్లో రాణిస్తారు. కుటుంబ సౌఖ్యం, వాహన యోగం పొందుతారు. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. శత్రువులు మిత్రులుగా మారి సహకారం అందిస్తారు.
 
మకరం:- పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. మీ బంధవులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. పాత రుణాలు తీరుస్తారు. అనుకోకుండా ఒక వ్యవహారం మీకు అనుకూలిస్తుంది.
 
కుంభం:- ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. రాజకీయ నేతలతో సంభాషించేటపుడు ఓర్పు, సంయమనం పాటించండి. మీరంటే అందరికీ గౌరవం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం.
 
మీనం:- ఎదుటివారిని గమనించి ఎత్తుకు పై ఎత్తువేయడం వల్ల గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఊహించని ఖర్చులు, తప్పనిసరి చెల్లింపుల వల్ల ఒకింత ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. శారీరకశ్రమ, ఆలాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. తల పెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కొటారు.