సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

మంగళవారం రాశిఫలాలు - లక్ష్మీదేవిని ఎర్రని పూలతో పూజించిన శుభం...

మేషం:- వృత్తుల్లో తోటివారితో అభిప్రాయభేదాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు వహించండి. మిత్రులపై ఉంచిన నమ్మకం సన్నగిల్లుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు కలిసిరాగలవు. హోటల్ తిరుబండారు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీరు చేపట్టిన పనికి ఇతరుల నుంచి అవాంతరాలు ఎదుర్కుంటారు.
 
వృషభం:- ఉపాధ్యాయులు విశ్రాంతి లేకుండా శ్రమిస్తారు. సహకార సంఘాల్లో వారికి, ప్రైవేటుసంస్థల్లో వారికి గుర్తింపు లభిస్తుంది. దైవకార్యక్రమాలలో పాల్గొంటారు. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటుటవలన ఆందోళనకు గురవుతారు. దేవాలయ, విద్యాసంస్థలకు దానధర్మాలు చేయడం వల్ల మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది.
 
మిథునం:- ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోయే అవకాశం ఉంది. మీ వాగ్దాటి, సమయస్పూర్తితో కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. ఫైనాన్స్, చిట్‌ఫండ్ వ్యాపారస్తులకు నూతనోత్సాహం కానవస్తుంది. విదేశాలు వెళ్ళే ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. స్త్రీలు భేషజాలకు పోకుండా పరిస్థితులకు అనుగుణంగా మెలగటం మంచిది.
 
కర్కాటకం:- ఒకానొక సందర్భంలో మిత్రుల వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. ఆదాయ వ్యయాల్లో ఏకాగ్రత వహించండి. అనుకున్న సమయానికి ధనం అందకపోవటంతో ఒడిదుడుకులు తప్పవు. ఆత్మీయుల క్షేమసమాచారాలు సంతృప్తినిస్తాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాల అభివృద్ధికి బాగా శ్రమించవలసి ఉంటుంది.
 
సింహం:- ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. భాగస్వామిక చర్చలు అర్థాంతంగా ముగుస్తాయి. ముఖ్యుల గురించి అప్రియమైన వార్తలు వినవలసివస్తుంది. స్త్రీలు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులకు ఇతర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి.
 
కన్య:- స్త్రీలకు పుట్టింటిపై ధ్యాస మళ్ళుతుంది. ధనం అధికంగా వ్యయం చేసినా ఒక మంచి పనిచేసిన తృప్తి ఉంటుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు ఆశించినంత సంతృప్తినీయవు. క్రయ విక్రయాలు బాగున్నా అంత లాభసాటిగా ఉండవు.
 
తుల:- భాగస్వామిక చర్చల్లో మీ సూచనలకు మంచి స్పందన లభిస్తుంది. పుణ్యక్షేత్ర సందర్శనలు, దూర ప్రయాణాలకు అనుకూలం. సంఘంలో గుర్తింపు, ప్రశంసలు పొందుతారు. వృత్తి వ్యాపారులకు అన్నివిధాలా అనుకూలం. కుటుంబీకులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆశలు వదిలేసుకున్న ఒక అవకాశం మీకే అనుకూలిస్తుంది.
 
వృశ్చికం:- ఉద్యోగస్తుల సమర్థత, పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఒత్తిడి తప్పదు. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు మార్చుకోవలసి వస్తుంది. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. అనుకున్న పనులు ఒక పట్టాన పూర్తికావు.
 
ధనస్సు:- ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి వేధింపులు అధికమవుతాయి. మొహమాటం, మెతకదనం వీడి నిక్కచ్చిగా వ్యవహరిస్తేనే అనుకున్నది సాధ్యమవుతుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పుచాలా అవసరం. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో సమస్యలు తప్పవు. విద్యార్థులకు అత్యుత్సాహం కూడదు.
 
మకరం:- స్త్రీలకు ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులకు తోటివారి వల్ల ఇబ్బందులు తప్పవు. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆర్యోగంలో మెళుకువ అవసరం. సమయానికి చేతిలో ధనం లేక ఇబ్బందు లెదుర్కుంటారు. అన్ని సమస్యలూ ఒక్కసారిగా మీదపడతాయి.
 
కుంభం:- ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. దైవ, సేవ, పుణ్య కార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఆపదసమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. ఎలక్ట్రానికల్, మెకానికల్ రంగాల వారికి సామాన్యం.
 
మీనం:- ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. వృత్తుల వారికిశ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. ఎదుటి వారితో ముక్తసరిగా సంభాషిస్తారు. ఇతురుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. రేషన్ డీలర్లకు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. విద్యార్థులు కొన్ని నిర్భందాలకు లోనవుతారు.