బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

శుక్రవారం రాశిఫలాలు - గణపతిని గరికె లేదా జమ్మి ఆకులతో పూజించినా...

24-09-2021 - శుక్రవారం. శ్రీ ప్లవనామ సం|| భాద్రపద బ|| తదియ ఉ.7.00 అశ్వని ఉ.8.42 ఉ.వ.6.07వ రా.వ.7.11 ల8.56. ఉదు.817ల 9.06 పుదు.12.240 1.14. 
 
మేషం:- ప్రైవేటు సంస్థలలోని వారు భేషజాలకు పోకుండా లౌక్యంగా వ్యవహరించండి. ముఖ్యల రాకతో మీలో నూతనోత్సాహం నెలకొంటుంది. వృత్తి వ్యాపారులకు శుభదాయకం. చెడు అలవాట్లకు, స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. మీ తెలివి తేటలకు వాక్చాతుర్యానికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
వృషభం:- నిత్యవసర వస్తువ్యాపారులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. నూతన వ్యక్తుల పరిచయం మీకెంతో సంతృప్తి నివ్వగలదు. స్త్రీలు మొండివైఖరి అవలంభించడం వల్ల మాటపడవలసి వస్తుంది. విద్యార్థుల ఆలోచనలు పక్కదోవ పట్ట కుండా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. కోర్టు వ్యవహరాలు ఒక కొలిక్కిరాగలవు.
 
మిథునం:- ఉద్యోగస్తులు అధిక శ్రమ పడినప్పటికి తగిన గుర్తింపు ఉండదు. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు. స్థిరాస్తి కొనుగోలు యత్నం వాయిదా పడటం మంచిది. ఉత్తర ప్రత్యుత్తరాలలో మెలకువ వహించండి. ఇతరుల వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందిస్తారు.
 
కర్కాటకం:- కుటుంబ సౌఖ్యము, వృత్తి వ్యాపారాదుల యందు అభివృద్ధి కానరాగలదు. ప్రేమికుల నిర్ణయాలు వివాదాలకు దారితీస్తుంది. గృహంలో మార్పులు చేర్పులు వాయిదా వేయడం శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు సవాలుగా నిలుస్తాయి. చిన్నతరహా, చిరువృత్తుల వారికి శ్రమాధిక్యత తప్పదు.
 
సింహం:- ఉద్యోగస్తులు ఇతర వ్యాపకాలను వీడనాడి శ్రమించడం శ్రేయోదాయకం. సన్నిహితుల నుంచి అందిన సమాచారం కొత్త ఉత్సాహాన్నిస్తుంది. వృత్తి వ్యాపారాలు ప్రగతి పథంలో నడుస్తాయి. రుణసహాయం చేసే విషయంలో ఆచి, తూచి వ్యవహరించండి. మీ సంతానం విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.
 
కన్య:- ముఖ్యుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ప్రైవేటు సంస్థల్లో వారికి శ్రమాధిక్యత తప్పదు. ఖర్చుల విషయంలో ఆచి తూచి వ్యవహరించడం మంచిది. హామీలు ఉండటం మంచిది కాదని గ్రహించండి. విందులు, వినోదాలలోపాల్గొంటారు.
 
తుల:- ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాల్లో మెలకువ వహించండి. విలువైన వస్తువులు, ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆధ్యాత్మిక, సేవా, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పత్రిక, వార్తా సంస్థలలోని వారికి యాజమాన్యం నుంచి ఒత్తిడి అధికమవుతుంది.
 
వృశ్చికం:- బంధు మిత్రులను కలుసుకుంటారు. నిర్మాణ పనుల్లో ఏకాగ్రత అవసరం. ప్రయాణాలు, మీ కార్యక్రమాలు వాయిదా పడటం మంచిది. ఉద్యోగస్తులు నూతన హోదాలు పొందే ఆస్కారం ఉంది. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి. ఆరోగ్య విషయంలో అలక్ష్యం తగదు. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్లకు లౌక్యం అవసరం.
 
ధనస్సు:- ఆకస్మిక ప్రయాణాలు మీకెంతో చికాకు కలిగిస్తాయి. ఋణప్రయత్నం ఫలించకపోవచ్చు. నిత్యావసర స్టాకిస్టులకు మిశ్రమ ఫలితం. ఫైనాన్స్, చిట్‌ఫండ్ రంగాలలో వారికి మెళకువ అవసరం. ఉపాధ్యాయులు అధిక శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లతీరు ఆందోళన కలిగిస్తుంది.
 
మకరం:- కుటుంబ, ఆర్థిక విషయాలు గోప్యంగా ఉంచండి. ముఖ్యులను కలుసుకుంటారు. మీ కష్టానికి గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. షాపింగ్ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. కోర్టు, ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
 
కుంభం:- ఉద్యోగస్తులకు విధినిర్వహణలో సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. స్త్రీలకు ఆర్జన, విలాస వస్తువుల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. బంధువుల రాకతో గృహంలో కొత్త ఉత్సాహం, సందడి చోటు చేసుకుంటాయి. దుబారా ఖర్చులు తగ్గించాలన్న మీ యత్నం ఫలించదు. చక్కని ప్రణాళికలతో విజయాన్ని సాధిస్తారు.
 
మీనం:- విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. సభలు, సమావేశాల్లో ప్రముఖంగా పాల్గొంటారు. రాజకీయాల్లో వారు ప్రతిపక్షాల పట్ల ఓర్పు, నేర్పుతో వ్యవహరించాలి. బంధవుల మధ్య అపోహలు తొలగి రాకపోకలు పునః ప్రారంభమవుతాయి. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.