గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (08:47 IST)

21-09-2021 మంగళవారం రాశిఫలాలు - కుబేరుడిని ఆరాధించినా... (video)

మేషం : రాజకీయాల్లో వారికి విరోధుల విషయంలో అప్రమత్తత అవసరం. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఉద్యోగస్తుల సమర్థతను, అంకితభావాన్ని అధికారులు గుర్తిస్తారు. క్యాటరింగ్ పనివారలకు, హోటల్, తినుబండారాల వ్యాపారులు సంతృప్తినిస్తాయి. 
 
వృషభం : రవాణా రంగంలోని వారికి చికాకు తప్పదు. ఉత్తర ప్రత్యుత్తరాలు, సంప్రదింపుల విషయంలో సంతృప్తికానరాగలదు. సందర్భానుకూలంగా సంభాషించడం వల్ల మీకు గుర్తింపు లభిస్తుంది. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు ఏకాగ్రత, స్వయం పర్యవేక్షణ ఎంతో ముఖ్యం. సతీ సమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. 
 
మిథునం : ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. సోదరులతో ఏకీభవించలేకపోతారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. స్త్రీలకు బంధువులతో పట్టింపులు అధికమవుతాయి. 
 
కర్కాటకం : భాగస్వామ్యుల మధ్య అవగాహన కుదరదని చెప్పవచ్చు. ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్ ట్రావెలింగ్ రంగాల వారికి ఆశాజనకంగా ఉంటుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. సేవా, పుణ్య కార్యాలలో మీ శ్రమకు మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తాయి. 
 
సింహం : మీ ఆశయసిద్ధికి నిరంతర కృషి, పట్టుదల ముఖ్యమని గమనించండి. మీరు కోరుకుంటున్న అవకాశాలను పొందే సమయం ఆసన్నమవుతుంది. రావలసిన బకాయిల సకాలంలో అందుతాయి. ముఖ్యమైన విషయాల్లో సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. స్త్రీలకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. 
 
కన్య : కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ వ్యాపారులకు లాభదాయకం. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. పుణ్యక్షేత్ర సందర్శనలు, దూరప్రయాణాలకు అనుకూలం. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాలు అనుకూలించవు. భార్య, భర్తల ఆలోచనలు, అభిప్రాయభేదాలు భిన్నంగా ఉంటాయి. 
 
తుల : కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. రాజకీయ విషయాల పట్ల ఆసక్తి అధికమవుతుంది. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. అతిథి మర్యాదలు బాగా నిర్వహిస్తారు. అనుక్షణం మీ సంతానం చదువు ఉద్యోగ విషయాలపై ఆలోచిస్తారు. 
 
వృశ్చికం : ఉద్యోగస్తులు అకారణంగా మాటపడవలసి వస్తుంది. తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ధనం అధికంగా వ్యయం చేసినా ఒక మంచి పని చేసిన తృప్తి ఉంటుంది. సహచరుల సలహా వల్ల నిరుద్యోగులు అవకాశాలు జారవిడుచుకుంటారు. రాబడికి మించిన ఖర్చులెదురైనా ఇబ్బందులేమాత్రం ఉండవు. 
 
ధనస్సు : వృత్తి వ్యాపారులకు సమస్యలెదురైనా అదాయానికి కొదవ ఉండదు. కానివేళలో ఇతరులరాక ఇబ్బంది కలిగిస్తుంది. రాజకీయ నాయకులకు ఆందోళనలు అధికమవుతాయి. ప్రియతములిచ్చే సలహా మీకెంతో సంతృప్తినిస్తుంది. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక ఫలిస్తుంది. రోజంతా ఆహ్లాదకరంగా గడిచిపోతుంది. 
 
మకరం : వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారులకు పనివారలతో చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. ఒక స్థిరాస్తి అమర్చుకునే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ప్రేమికుల మధ్య అవగాహన కుదరదు. వాతావరణంలో మార్పు వల్ల పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. 
 
కుంభం : రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుుకుంటారు. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. వాహనం, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. 
 
మీనం : కొంతమంది మిమ్మలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. స్త్రీలకు శ్రమాధిక్యత, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. నూతన దంపతులలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఏజెంట్లు, బ్రోకర్లకు నిరుత్సాహం తప్పదు.