సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

26-09-2021 ఆదివారం రాశిఫలాలు - ఆదిత్యుని తెల్లని పూలతో...

శ్రీ ప్లవనామ సం|| భాద్రపద ఇ|| పంచమి ఉ.10.38 కృత్తిక ప.1.28 వర్ణ్యము లేదు. సాదు.4.30 ల 5.19.7 ఆదిత్యుని తెల్లని పూలతో పూజించిన మనోసిద్ధి, సంకల్పసిద్ది చేకూరుతుంది. 
 
మేషం:- అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులు చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడం మంచిది. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయల వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. గృహంలో మార్పులు అనుకూలిస్తాయి.
 
వృషభం:- భాగస్వామిక ఒప్పందాలు ఒక కొలిక్కి రాగలవు. నిరుద్యోగులనకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెకుకువ అవసరం. పాత మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి.
 
మిధునం:- ఆర్థిక విషయాల్లో ఊహించని మార్పు కానవస్తుంది. కుటుంబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం వల్ల కొత్త అనుభూతి కలుగుతుంది. హోటల్, తినుబండ వ్యాపారులకు కలిసిరాగలదు. ఖర్చులు పెరగడంతో అదనపు రాబడికై యత్నిస్తారు. స్త్రీలకు పనివారితో చికాకులు అధికమవుతాయి.
 
కర్కాటకం:- నూనె మిర్చి, కంది, వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. రావలసిన ధనం అందుతుంది. ఎప్పటి నుండో వాయిదా పడుతున్న పనలు పూర్తిచేస్తారు. కంప్యూటర్, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి పురోభివృద్ధి, సందర్భానుకూలంగా సంభాషించి సమస్యలకు దూరంగా ఉండండి. ఆలయాలను సందర్శిస్తారు.
 
సింహం:- ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. స్త్రీలు కళాత్మక, క్రీడ, క్విజ్ పోటీల్లో రాణిస్తారు. ప్రముఖుల కలయికతో పనులు పూర్తవుతాయి. రాజకీయ నాయకులకు ఆందోళనలు అధికమవుతాయి. ప్రయాణాల్లో చురుకుదనం కౌనవస్తుంది. దైవ, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి కనబరుస్తారు.
 
కన్య:- ఆర్థికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఎదుటి వారి నుంచి విమర్శలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సామాన్యం. బంధువులతో సంభాషించేటప్పుడు మెళకువ అవసరం. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ, ఏకాగ్రత చాలా అవసరం.
 
తుల:- నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మీరు చేయదల్చుకున్న ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా సాగవు. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా ఖర్చుచేస్తారు. బాధ్యతాయుతంగా వ్యవహరించి మీ గౌరవాన్ని కాపాడుకోండి. కార్యదీక్షతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. 
 
వృశ్చికం:- మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. దంపతుల మధ్య అవగౌహనాలోపం చికాకులు వంటివి చోటుచేసుకుంటాయి. చేతివృత్తుల వారికి అన్ని విధాలా పురోభివృద్ధి. మిత్రులతో సంభాషించటం వల్ల మీలో మానసిక ధైర్యం, కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటాయి. రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరగలదు.
 
ధనస్సు:- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సామాన్యం. నూతన వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. విలువైన కానుక ఇచ్చి మీ శ్రీమతిని ప్రసన్నం చేసుకుంటారు. ఆప్తుల రాకతో మానసికంగా కుదుటపడతారు.
 
మకరం:- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన సమసిపోగలవు. ఇతరుల సహాయం అర్థించటానికి మొహమ్మాటం అడ్డు వస్తుంది. ఎంతటి క్లిష్ట సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కుంటారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో నూతన పరిచయా లేర్పడతాయి. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.
 
కుంభం:- మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. మీ సమస్య ఒకటి సానుకూలం కావటంతో మానసికంగా కుదుటపడతారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో ఏమరుపాటు, అశ్రద్ధకూడదు. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. వాహనం ఇచ్చి విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.
 
మీనం:- ఉమ్మడి ఆర్థిక వ్యవహారాల్లో మాటపడాల్సి వస్తుంది. గృహానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ కళత్ర వైఖరిలో మార్పు సంతోషపరుస్తుంది. స్త్రీల మాటకు కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. విద్యార్ధులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.