శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

08-10-2021 శుక్రవారం దినఫలాలు .. అమ్మవారిని సువర్ణగన్నేరు పూలతో...

మేషం:- ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక స్ఫురిస్తుంది. ఎంతటి వారినైనా ఆకట్టుకుని వ్యవహారాలు చక్కదిద్దుతారు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి. స్త్రీలు అంతగా పరిచయం లేని వ్యక్తులకు దూరంగా ఉంచండి. స్వయంకృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి.
 
వృషభం:- ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. మీ ఆశయ సాధనకు నిత్య కృషి, పట్టుదల ఎంతో అవసరం. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. అక్రమ సంపాదనల వైపు దృష్టి సారించక పోవడం మంచిది. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోని వారికి పనివారలతో చికాకులను ఎదుర్కుంటారు.
 
మిధునం:- ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికారులతో తనిఖీలు, పర్యటనలు తప్పవు. వ్యవసాయరంగంలోని వారికి వాతావరణంలో మార్పు ఆందోళన కలిగిస్తుంది. సంఘంలో గౌరవం పొందుతారు. ఎల్.ఐ.సి, ఫిక్సెడ్ డిపాటజిట్లకు సంబంధించిన సొమ్ము చేతికందుతుంది. ప్రభుత్వ సంబంధిత కార్యాలు సకాలంలో నెరవేరుతాయి.
 
కర్కాటకం:- దైవ పుణ్యకార్యక్రమాలలో పాల్గొంటారు. బిల్లులు చెల్లిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. రాజకీయ నాయకులు కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తుతాయి. వైద్యులకు ఏకాగ్రత, మెళుకువ అవసరం. ధనం నిల్వ చేయాలనే మీ ఆలోచన ఫలించదు. ప్లీడరు, ప్లీడరు గుమస్తాలకు పురోభివృద్ధి కానవస్తుంది.
 
సింహం:- కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి, శ్రమాధిక్యత అధికం. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. మీ మాటే నెగ్గాలన్న పట్టుదలకు పోవటం మంచిది కాదు. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్లే ఆస్కారం ఉంది. తల్లి, తండ్రి ఆరోగ్యము గురించి ఆందోళన అధికమవుతుంది.
 
కన్య:- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. కొబ్బరి, పండ్లు,పూలు, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రింట్, మీడియాలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు పనివారితో చికాకులను ఎదుర్కొంటారు. ప్రకటనలు, రాజకీయ కళా రంగాల వారికి ప్రోత్సహకరం.
 
తుల:- వేతనం తక్కువైనా వచ్చిన అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవటం శ్రేయస్కరం. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం శ్రేయస్కరం. పాత జ్ఞాపకాల గురించి మీ మిత్రులతో చర్చించడంలో ఉల్లాసాన్ని పాలు పొందుతారు. ఆకస్మికంగా పొట్ట తలకి సంబంధించిన చికాకులు తలెత్తుతాయి. 
 
వృశ్చికం:- ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. ప్రత్తి, పొగాకు, చెరకు రైతులకు సంతృప్తి కానవస్తుంది. శత్రువులు మిత్రులుగామారి సహాయం అందిస్తారు. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. పెంపుడు జంతువులపై ప్రేమ, శ్రద్ధ చూపిస్తారు.
 
ధనస్సు:- ఉద్యోగరీత్యా దూరప్రయాణాలు అనుకూలిస్తాయి. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. కార్యాలయంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు.
 
మకరం:- మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. ఒకానొక సందర్భంలో మీ సంతానం వైఖరి మీకెంతో అసహనం కలిగిస్తుంది. ఊహగానాలతో కాలం వ్యర్థం చేయక సకాలంను సద్వినియోగం చేసుకోండి. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి నిరుత్సాహపరుస్తుంది.
 
కుంభం:- ప్రముఖులతో కీలకమైన వ్యవహారాలు చర్చలు జరుపుతారు. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. మీరు చేసే కృషి వల్ల మీ ప్రతిభ వెలుగులోనికి వచ్చి మంచి విజయం సాధిస్తారు. ధనం ఎంత వస్తున్నా ఏ మాత్రం నిల్వ చేయలేకపోతారు. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు.
 
మీనం:- వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. శత్రువులను మిత్రులుగా మార్చుకుంటారు. మీ ఆలోచనలను కొంతమంది తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు. అదనపు సంపాదన పట్ల దృష్టి సారిస్తారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు.