శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 16 అక్టోబరు 2021 (21:42 IST)

17-10-2021 నుంచి 23-10-2021 వరకు వార రాశిఫలాలు

మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
ఆశావహ దృక్పథంతో యత్నాలు సాగించండి. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంది. పదవుల నుంచి తప్పుకోవలసి వస్తుంది. ఏది జరిగినా మంచికేనని భావించండి. ఖర్చులు సామాన్యం. కొంత మొత్తం ధనం అందుతుంది. పరిచయస్తులు ధన సహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆది, సోమ వారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. దంపతుల ఆలోచనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. ఉపాధి పథకాలు ఏమంత సంతృప్తినీయవు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. భవన నిర్మాణ కార్మికులకు ఆశాజనకం. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. రోజు వారీ ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. మంగళవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అధికారులకు హోదా మార్పు. కంప్యూటర్ రంగాల వారికి నిరాశాజనకం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్థ, పునర్వసు 1, 2, 3 పాదములు 
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు సామాన్యం. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. గురు, శుక్ర వారాల్లో పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. గృహమార్పు కలిసివస్తుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలో పునరాలోచన అవసరం. పెట్టుబడులకు తరుణం కాదు. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. కాంట్రాక్టర్లకు ధనయోగం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. విద్యార్థులకు ఒత్తిడి, శ్రమ అధికం. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
బంధుత్వాలు బలపడతాయి. వాగ్దాటితో ఆకట్టుకుంటారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఒక సచారం ఉత్సాహాన్నిస్తుంది. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. బుధ, శని వారాల్లో ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు ఉల్లాసాన్నిస్తాయి. కీలక పత్రాలు అందుకుంటారు. పనివారాల తీరు చికాకుపరుస్తుంది. వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మీ ప్రమేయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం. ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లు, మొహమ్మాటాలకు లొంగవద్దు. పనులు హడావుడిగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆది, గురు వారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహమరమ్మతులు చేపడతారు. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. షాపు పనివారలతో జాగ్రత్త. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. వాహనచోదకులకు దూకుడు తగదు. స్పెక్యులేషన్ రంగాల వారికి ఆశాజనకం. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. 
 
కన్య ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
యత్నాలకు అయిన వారి ప్రోత్సాహం ఉంది. ఆశావహ దృక్పథంతో శ్రమించండి. సలహాలు, సాయం ఆశించవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. విమర్శలు, అభియోగాలకు ధీటుగా స్పందిస్తారు. మీ చిత్తశుద్ధి ఎదుటివారికి కనువిప్పు కలిగిస్తుంది. బంధుత్వాలు బలపడతాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. కొంతమొత్తం సాయం అందించండి. సోమ, మంగళ వారాల్లో అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలేయండి. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ముఖ్యులకు స్వాగతం పలుకుతారు. వైద్య సాంకేతిక రంగాల వారికి ఆశాజనం. కోర్టు వాయిదాలకు హాజరవుతారు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
ఈ వారం సంప్రదింపులకు అనుకూలం. ఆచితూచి అడుగేయాలి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఒకేసారి అనేక పనులతో సతమతమవుతారు. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. ఏదో సాధించలేకపోయామన్న వెలితి ఉంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్తేజాన్నిస్తుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. కీలక పత్రాలు అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. గృహమార్పు అనివార్యం. సంతానం దూకుడు అదుపు చేయండి. వ్యాపారాలు అంతగా సాగవు. చిరు వ్యాపారులకు కష్టకాలం. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. బిల్డర్లు, కాంట్రాక్టర్లకు నిరాశాజనకం. పదవులు, బాధ్యతల నుంచి తప్పుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు 
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. ఎదుటివారి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. ఓర్పుతో మెలగండి. విమర్శలకు స్పందించవద్దు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. సన్నిహితుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. ఆశావహ దృక్పథంతో యత్నాలు సాగిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. నిర్మాణాలు, మరమ్మతులు వేగవంతమవుతాయి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు ధనప్రలోభం తగదు. ఆస్తి వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయం సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. బుధవారం నాడు బాధ్యతలు అప్పగించవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అపరిచితులతో జాగ్రత్త. ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కుంటారు. పత్రాల రెన్యువల్ లో అలక్ష్యం తగదు. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళన. ప్రయాణం విరమించుకుంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
ఆచితూచి అడుగేయాలి. పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పెద్దల సలహా పాటిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు, గురు, శుక్ర వారాల్లో పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. సోదరుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. పంతాలు, పట్టింపులకు పోవద్దు. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. కొన్ని అవకాశాలు అనుకోకుండా కలిసివస్తాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం కాదు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు 
ప్రతికూలతలు అధికం. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. గుట్టుగా వ్యవహరించండి. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనసహాయం అర్ధించేందుకు మనస్కరించదు. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. బుధ, గురు వారాల్లో పనులు హడావుడిగా సాగుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. భాగస్వామిక వ్యాపారాలు, వెంచర్లు కలిసిరావు, రిటైర్లు ఉద్యోగస్తులకు వీడ్కోలు పలుకుతారు. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ప్రయణం ప్రశాంతంగా సాగుతుంది.
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆత్మీయులతో సంభాషణ ఉల్లాసం కలిగిస్తుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. ప్రముఖులతో సంబంధాలు బలపడతాయి. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. పాత పరిచయస్తులు తారసపడతారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి అధికం. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ పకాలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. వాహనచోదకులకు దూకుడు తగదు. సామాజిక, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు.