1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Schools are Re-Open from August 16th in Andhra Pradesh

ఏపీలో 16 నుంచి పాఠశాల ఓపెన్ : మంత్రి ప్రకటన

Andhra Pradesh
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16వ తేదీ నుంచి పాఠశాలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 16 నుంచి స్కూళ్లను రీ-ఓపెన్ చేస్తున్నట్లు వెల్లడించారు. 
 
రెగ్యులర్ టైమింగ్సులోనే స్కూళ్లను రన్ చేస్తామని, కోవిడ్ ప్రొటోకాల్ పాటించేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి సురేష్ పేర్కొన్నారు. ఇప్పటివరకు ఏపీ వ్యాప్తంగా 95 శాతం మంది టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తయిందని తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకోని మిగిలిన టీచర్లకు కూడా టీకాలు వేయాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించామన్నారు.
 
ఏపీలో ఆన్లైన్ తరగతులు ఎక్కడా జరగడం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు. ప్రైవేట్ పాఠాశాలల్లో ఆన్లైన్ తరగతులు నడపొద్దని ఆదేశించామన్నారు. ఈ నెల 16 నుంచి ఆఫ్ లైన్‌లోనే పూర్తి స్థాయిలో పాఠశాలలను నిర్వహిస్తామన్నారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
కాళ్లు చేతులు విరగ్గొట్టేస్తాం : తెరాస ఎమ్మెల్యే