1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Inter College open from August 16th in Andhra Pradesh

ఏపీలో 16 నుంచి ఇంటర్ కాలేజీలు ఓపెన్

Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒకవైపు, కరోనా వైరస్ థర్డ్ వేవ్ తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు, ఇంటర్మీడియట్ తరగతుల ప్రారంభించేందుకు తేదీని ఖరారు చేసింది. 
 
ఈ మేరకు 2021-22 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్ సెకండ్ ఇయర్ ప్రత్యక్ష తరగతులను ఆగస్టు 16 నుంచి ప్రారంభించనున్నట్లు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ రామకృష్ణ తెలిపారు.
 
ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలన్నీ ఆ రోజు తెరుచుకుంటాయని, కొవిడ్ ప్రొటోకాల్స్ పాటించాలని ఆదేశించారు. కరోనా కారణంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం ఇటీవలే అందర్నీ పాస్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ సెకండియర్‌కు ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఆసియాలోనే ఉత్తమ ఎయిర్‌పోర్టు ఏది?