1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Shidha Raghava Rao into the YCP

వైసీపీలోకి శిద్ధా రాఘవరావు

Shidha Raghava Rao
ప్రకాశం జిల్లాకు చెందిన. టీడీపీ నేత, మాజీమంత్రి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తన కొడుకుతో సహా జగన్ సమక్షంలో అధికార పార్టీ కండువా కప్పుకున్నారు.

తండ్రీకొడులిద్దరికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి జగన్ ఆహ్వానించారు. శిద్దా మంగళవారం టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ప్రకాశం జిల్లాలో శిద్దాకు గ్రానెట్ క్వారీలున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో గ్రానైట్‌ రంగంలో ఉన్న టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని, ప్రభుత్వం వేధింపులకు దిగింది.

శిద్దాతోపాటు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుకు చెందిన క్వారీల్లోని నిక్షేపాల విక్రయాలకు అనుమతులు నిలిపివేశారు. గతంలో వీరితోపాటు ఆ రంగంలోని మరికొందరికి కూడా భారీ జరిమానాలు విధిస్తూ నోటీసులు ఇచ్చారు.
About Writer
ఎం