త్వరలో వైసిపిలోకి టిడిపి ఎమ్మెల్యేలు: చీరాల ఎమ్మెల్యే
త్వరలో కొందరు టిడిపి ఎమ్మెల్యేలు వైసిపిలోకి రానున్నారని చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కరణం ఒంగోలులో సోమవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు చెందిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు వైసిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వైఖరితోనే ప్రకాశం జిల్లాకు తీరని అన్యాయం జరిగిందన్నారు. రెండు సంవత్సరాల క్రితమే వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి కావాల్సి ఉందన్నారు.
గత ప్రభుత్వ అసమర్ధత, చంద్రబాబు నాయుడు అనాసక్తి వల్లే ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ పూర్తయితే జిల్లా సాగు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉంటుందని తెలియజేశారు.