1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Software engineer murdered in vizianagaram dist

బైకుపై తాతగారి ఊరెళుతున్న టెక్కీ.. కొట్టి చంపేసిన దుండగులు... ఎక్కడ?

konari prasad
ఏపీలోని విజయనగరం జిల్లా తెర్లాం మండలం, నెమలాంలో టెక్కీ దారుణ హత్యకు గురయ్యాడు. బైకుపై తన తాతగారి ఊరుకు వెళుతుండగా, గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి కొట్టి చంపేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నెమలాం గ్రామానికి చెందిన కొనారి ప్రసాద్ (28) అనే యువకుడు టెక్కీగా పని చేస్తున్నాడు. 
 
సోమవారం రాత్రి తన బైకుపై తాతగారి ఊరు బూరిపేట నుంచి నెమలాం వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం. మృతుడి తలపై తీవ్ర గాయంతో పాటు శరీరంపై దెబ్బలు తగిలిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి.
 
మృతుడు బెంగుళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితమే గ్రామానికి వచ్చాడు. ఘటనా స్థలాన్ని డాగ్, బాంబు స్క్వాడ్ బృందాలు పరిశీలించాయి. హత్య జరిగిన తీరు, దీనికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా? ఈ ఘటనకు అదే కారణమా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. 
తర్వాతి కథనం
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు : పోలీసులు బలవంతంగా సంతకం చేయించారంటూ పల్టీ..