సోమవారం, 10 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (09:22 IST)

దివ్యాంగురాలిపై మాయమాటలు చెప్పి అత్యాచారం చేసిన మామ...

Rape
సమాజంలోని కొందరు కామాంధులు ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. నిండు అంధురాలైన ఓ యువతిపై వరుసకు మామ అయ్యే ఓ కామమృగం అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని పలాస మండలంలోని ఓ గ్రామానికి చెందిన దివ్యాంగురాలికి అదే గ్రామానికి చెందిన వరిశ భాస్కరరావు అనే వ్యక్తి మాయమాటలు చెప్పేవాడు. మామ వరసయిన అతడు 7 నెలల కిందట ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె వద్దని నిరాకరించినా కల్ల బొల్లి మాటలు చెప్పి, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. 
 
ఆ తర్వాత ఆ యువతి తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో గత 22వ తేదీన ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా గర్భవతి అని వైద్యులు తేల్చారు. ఈ విషయం బయటపడటంతో కుటుంబ సభ్యులు భాస్కరరావును పిలిపించి గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. 
 
ఇందులో తన తప్పు లేదని భాస్కరరావు వాగ్వాదానికి దిగారు. దీంతో ఆదివారం బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భాస్కరరావు తనను గర్భవతిని చేశాడని, తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.