తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీవేదాంత దేశికర్ ఆలయంలో సాలకట్ల ఉత్సవాల సందర్భంగా నవంబరు 11వ తేదీన సాత్తుమొర జరుగనుంది. శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఘంటా స్వరూపులు శ్రీవేదాంతదేశికర్. వీరి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ ఉత్సవం నిర్వహిస్తారు. నవంబరు 2వ తేదీ నుండి ఆలయంలో సాలకట్ల ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల చివరి రోజైన నవంబరు 11న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు శ్రీవేదాంత దేశికర్ ఆలయానికి వేంచేపు...