శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Updated : బుధవారం, 3 నవంబరు 2021 (17:17 IST)

తిరుమలలో రోజా-విశాల్, ఎవరితో ఫోటోలు తీసుకోవాలో తెలియక..?

తిరుమలలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సాధారణంగా తిరుమల అంటేనే ప్రముఖులు వస్తుంటారు. ప్రతిరోజు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. అయితే దీపావళి పర్వదినం సందర్భంగా తిరుమలకు ఇద్దరు ప్రముఖులు రావడం..ఎవరితో సెల్ఫీలు తీసుకోవాలో తెలియక భక్తులు ఆలోచనలో పడిపోవడం కనిపించింది.

 
తిరుమల శ్రీవారిని ఈరోజు తెల్లవారుజామున విఐపి విరామ దర్సనా సమయంలో సినీనటి, నగరి ఎమ్మెల్యే రోజాతో పాటు నటుడు విశాల్‌లు దర్సించుకున్నారు. వేర్వేరుగా శ్రీవారి సేవలో వీరు పాల్గొన్నారు. అయితే ఆలయం బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఇద్దరూ ఒకేసారి కలిసి వచ్చారు. 

 
సినీప్రముఖులు లోపల ఉన్నారన్న విషయం తెలుసుకున్న భక్తులు ఆలయం బయట క్యూకట్టారు. రోజాతో పాటు విశాల్‌తో ఫోటోలు తీసుకోవడానికి ఎగబడ్డారు. ఇద్దరు సినీప్రముఖులు వెళ్ళిపోతుండడంతో భక్తులు ఎవరితో ఫోటోలు దిగాలో తెలియక తికమకపడ్డారు.

 
కానీ రోజా మాత్రం అడిగిన వారికందరికీ సెల్ఫీలకు అవకాశమిస్తూ ముందుకు సాగారు. విశాల్ కూడా దూరం నుంచి అభిమానులను ఫోటోలు తీసుకోమని సూచించారు. సుమాఉ 20 నిమిషాల పాటు శ్రీవారి ఆలయం ముందు సినీప్రముఖుల సందడి కనిపించింది.