బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 నవంబరు 2021 (16:43 IST)

సెంటర్ ఏదైనా వైసీపీదే విజయం... రోజా

బద్వేల్‌ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో వైసీపీ పార్టీ బంపర్‌ విక్టరీ కొట్టడం పై వైసీపీ పార్టీ నగరీ ఎమ్మెల్యే రోజా ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. బద్వేలు నియోజక వర్గ ప్రజలందరికి కృతజ్ఞతలు చెప్పిన… ఆంధ్ర ప్రదేశ్‌ లో బీజేపీ పార్టీని అసెంబ్లీ సీటు కాదు క‌దా…. గేటు కూడా తాకనివ్వమని హెచ్చరించారు.
 
ఏ ఎన్నికలైనా … సెంటర్ ఏదైనా వైసీపీ పార్టీ దే విజయమని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రోజా. వైసీపీ సర్కార్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగానే ఇవాళ బద్వేల్‌ లో గెలిచామన్నారు.. సింగిల్‌ హ్యాండ్ తో గెలిపించిన ఘనత ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కే దక్కిందని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. 
 
బీజేపీకి డిపాజిట్ ఎందుకు గల్లంతు అయ్యిందో విశ్లేషించుకోవాలని… ఇప్పటికైనా రాష్ట్రానికి రావలసిన విభజన హామీలను ఢిల్లీ పెద్దలతో మాట్లాడి నెరవేర్చేందుకు ప్రయత్నించాలని డిమాండ్‌ చేశారు రోజా. కాగా.. బద్వేల్‌ ఎన్నికల్లో ఏకంగా   90,089 ఓట్ల మెజారిటీ తో వైసీపీ పార్టీ విజయం సాధించింది.