బద్వేల్ థర్డ్ రౌండ్ ఫలితాలు వెల్లడి... బీజేపీకి ఎన్ని ఓట్లు?
ఏపీలోని కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్‌లో ఇప్పటివరకు మూడు రౌండ్ల ఫలితాలను కౌంటింగ్ అధికారులు వెలువరించారు.
తొలి రెండు రౌండ్లలో ఆధిపత్యం ప్రదర్శించిన వైకాపా మూడో రౌండ్‌లోనూ ఆధిక్యం ప్రదర్శించింది. వైకాపా తరఫున బరిలో నిలిచిన దాసరి సుధ మూడో రౌండ్ ముగిసే వరకు 24,979 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.
ఈ రౌండ్‌లో వైకాపాకు 10,184 ఓట్లు, భాజపాకు 2,305, కాంగ్రెస్‌కు 598, నోటాకు 393 ఓట్లు పోలయ్యాయి. మరోవైపు తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు కూడా వెలువడుతున్నాయి.