గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 నవంబరు 2021 (17:56 IST)

ఉపఎన్నిక కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి...

హుజురాబాద్ బైపోల్ కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల అధికారులు. నవంబర్ 2న ఉదయం 8 గంటలకు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో కౌంటింగ్ మొదలు కానుంది. మొదటి అరగంట పాటు పోస్టల్ బ్యాలెట్లు లెక్కించనున్నారు. 
 
మొత్తం 753 మందికి పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. కోవిడ్ నిబంధనల మేరకు రెండు హాల్స్‌లో కౌంటింగ్ జరగనుంది. ఒక్క హాలులో 7 టేబుళ్ల చొప్పున ప్రతి రౌండ్‌కు 14 టేబుల్స్ పై 14 ఈవీఎలను లెక్కిస్తారు. మొత్తం 22 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది.
 
అలాగే కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక కౌంటిం‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల అధికారి కేతన్ గార్గ్ వెల్లడించారు. 2021, అక్టోబర్ 30వ తేదీన ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.
 
అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలో భారీ భద్రత నడుమ భద్ర పరిచారు. 2021, నవంబర్ 02వ తేదీ మంగళవారం పట్టణ శివారులోని బాలయోగి గురుకుల పాఠశాలలో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
281 పోలింగ్ కేంద్రాలకు ఒకే చోట కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేయడం జరిగిందని, కౌంటింగ్ హాల్స్ కూడా ఏర్పాటు చేశామన్నారు. నాలుగు హాళ్లలో 28 టేబుల్స్ ఏర్పాటు చేసి ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించడం జరుగుతుందని, కొన్ని టేబుళ్లు పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.