ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 అక్టోబరు 2021 (20:46 IST)

హుజురాబాద్‌లో విజయం ఎవరిది? రికార్డు స్థాయిలో పోలింగ్

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. గత రికార్డులు అన్నీ చెరిపేస్తూ భారీ పోలింగ్ నమోదవుతోంది. ఉదయం నుంచి గమనించినట్లయితే ప్రతీ రెండు గంటలకు 7.60 శాతం ఓటింగ్ పెరుగుతూ వస్తోంది. 
 
ఇంత భారీ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం ఏ పార్టీకి లాభిస్తుందో, ఏ పార్టీని ముంచేస్తోందోననే ఆందోళన నేతలు, అభ్యర్ధుల్లో కనిపిస్తోంది. సాయంత్రం ఏడు గంటల వరకు బూత్ లోపల క్యూలైన్లలో నిలబడ్డ ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం. 
 
దీంతో ఈసారి భారీగా పోలింగ్ నమోదయ్యే అవకాశం వుందని అధికారులు భావిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 84.5 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు 76.26 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 
 
టీఆర్ఎస్ వ్యతిరేక ట్రెండ్ వల్లే ఓటింగ్ పెరిగిందని బీజేపీ నేతలు చెబుతుండగా, ఈటలను ఓడించడానికే జనం పెద్ద ఎత్తున ఓట్లేస్తున్నారని గులాబీ నేతలు అంటున్నారు. దీంతో ఎవరికి వారే విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఎవరిది విజయమనేది ఈనెల 2న తేలిపోనుంది.