సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 30 అక్టోబరు 2021 (10:17 IST)

బద్వేలులో ముక్కోణపు పోటీ, హుజూరాబాద్‌లో తెరాస-భాజపా నువ్వా-నేనా

ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్‌, తెలంగాణలో హుజూరాబాద్‌ ఉప ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. రెండు నియోజక వర్గాల్లో ప్రచారం జోరుగా సాగగా అధికారులు ఏర్పాట్లు చేసిన పోలింగ్‌కు రోజు రానే వచ్చింది. బద్వేల్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే మృతి చెందడంతో ఉప ఎన్నిక జరుగుతోంది.
 
మంత్రి పదవికి ఈటెల రాజేందర్‌ రాజీనామా చేయడంతో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. బద్వేల్‌లో వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్‌, బీజేపీల మధ్య ముక్కోణపు పోరు జరుగుతుండగా, హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య పోటీ నెలకొంది.