సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 అక్టోబరు 2021 (09:49 IST)

హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ నేడే..

హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ జరుగుతోంది. ఇటు అధికార టీఆర్ఎస్.. అటు జాతీయ పార్టీ బీజేపీలు. అందుకే ఈ ఎన్నికను రెండు పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా ఈటల రాజకీయ భవితవ్యానికి కూడా ఈ ఎన్నిక ఫలితం కీలకం కానుంది. రాబోయే ఎన్నికలకు దీన్ని సెమీఫైనల్‌గా భావిస్తున్నాయి
 
ఇవాళ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. మొత్తం 306 పోలింగ్‌ స్టేషన్లలో 2,37,022 మంది ఓటర్లు తమ తీర్పును వెలువరించనున్నారు. టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీ అభ్య ర్థిగా బరిలోకి దిగిన ఈటల రాజేందర్‌కు, అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
 
దాదాపు ఐదునెలలుగా హోరాహోరీగా ప్రచారం సాగింది. ఆత్మగౌరవం పేరుతో ఈటల, అభివృద్ధి పేరుతో టీఆర్‌ఎస్‌ నువ్వా-నేనా అన్న స్థాయిలో జనాలకు చేరవయ్యే ప్రయత్నం చేశాయి. బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీల నేతలు పలువురు హుజురాబాద్‌లోనే మకాం వేసి ప్రచా రం నిర్వహించారు. ఈ ఉప ఎన్నిక ఫలితంపై తెలంగాణే కాదు, పొరుగు రాష్ట్రమైన ఏపీలోనూ రూ. కోట్ల మొత్తంలో పందేలు కాస్తుండటం గమనార్హం.