గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 నవంబరు 2021 (12:28 IST)

బద్వేల్‌లో వైకాపా అభ్యర్థి సుధ ఘన విజయం

కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో వైకాపా అభ్యర్థి సుధ ఘన విజయం సాధించారు. తొలి రౌండ్‌ నుంచి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించిన అభ్యర్థి దాసరి సుధ విజయాన్ని సొంతం చేసుకున్నారు. 12 రౌండ్లు ముగిసేసరికి ఆమె.. 90,089 ఓట్ల మెజార్టీని సాధించారు. 
 
మరోవైపు ఫ్యాన్​ పార్టీ జోరు ముందుకు ఇతర పార్టీలేవీ నిలబడలేకపోయాయి. ఇప్పటికే పోలైన ఓట్లలో దాదాపు సగం కంటే ఎక్కవగా  వైకాపాకు రావడంతో ఉప పోరులో వైకాపా గెలిచినట్లైంది. కాగా వైకాపా విజయాన్ని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. 
 
మరోవైపు, ఉప ఎన్నిక ఫలితాలపై భాజపా అభ్యర్థి పనతల సురేశ్ స్పందించారు. నైతికంగా తామే విజయం సాధించామన్నారు. వైకాపా ప్రభుత్వ పతనం బద్వేలు నుంచే ప్రారంభమైందన్నారు. ప్రజల పక్షాన పోరాడే పార్టీ భాజపా అని నిరూపించామని వ్యాఖ్యానించారు.