శుక్రవారం, 1 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 నవంబరు 2021 (09:57 IST)

మొక్కు తీర్చుకున్న హీరో విశాళ్

తమిళ హీరో విశాల్ మొక్కు తీర్చుకున్నారు. కాలినడకన తిరుమల కొండపైకి వెళ్లి శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. విశాల్ హీరోగా, మరో హీరో ఆర్య విలన్‌గా నటించిన ఎనిమి చిత్రం ఈ నెల 4వ తేదీన దీపావళికి ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌మోష‌న్స్‌లో విశాల్ పాల్గొంటున్నాడు. రీసెంట్‌గా హైద‌రాబాద్‌లో చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌గా, తన స్నేహితుడైన పునీత్ రాజ్ కుమార్ మరణం తర్వాత ఆయన చదివిస్తున్న 1800 మంది పిల్లల బాధ్యతను తాను తీసుకుంటున్నట్టు విశాల్ ప్రకటించారు. 
 
త‌న సినిమాలకు సంబంధించిన ప్రతి టికెట్ ధర నుంచి ఒక రూపాయి రైతులకు చేరేలా చేస్తున్నారు. అంతేకాదు తనకు సంబంధించిన ఫంక్షన్స్‌లో బొకేలను వాడొద్దని వాటికీ ఉపయోగించే డబ్బు ఆడపిల్లల చదువుకు ఉపయోగించమని కోరారు. 
 
అయితే తాజాగా విశాల్ నడక దారిన తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి మొక్కు చెల్లింపులో భాగంగా అలిపిరి కాలిబాట మార్గం గుండా నడుచుకుంటూ తిరుమల చేరారు విశాల్. మార్గమధ్యలో భక్తులు విశాల్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు.
 
విశాల్ న‌టించిన‌ ‘ఎనిమి’ చిత్రం ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెర‌కెక్క‌గా, మినీ స్టూడియోస్ పతాకంపై ఎస్ వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోన్న ఈ చిత్రంపై అంద‌రిలో భారీ అంచ‌నాలు ఉన్నాయి.