సంబంధిత వార్తలు
- ఆ టీటీడి సభ్యుడిని తొలగించండి, జనసేన నాయకులు డిమాండ్
- తిరుమల ఉద్యాన వనాలలో సుందరంగా ఉంచండి: ధర్మారెడ్డి
- 71 ఏళ్ళ వయసులో... డాక్టర్లు వద్దన్నా...బాబు దీక్ష...అసామాన్యం!
- గోశాలకు రెండు ఆవులు, దూడలు ఇచ్చిన టైమ్స్ ఆఫ్ ఇండియా చైర్మన్
- శ్రీవారి భక్తులు త్వరపడండి, స్వామి దర్సనం కావాలంటే టోకెన్లు బుక్ చేయాల్సిందే
అక్టోబరు 28న టిటిడి జూనియర్ కళాశాలల్లో ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్లు
టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి జూనియర్ కళాశాలల్లో 2021-22 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి గాను అక్టోబరు 28న ఉదయం 9 గంటలకు ఆయా కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్టు టీటీడీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
టిటిడిలో విధులు నిర్వహిస్తున్న రెగ్యులర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పిల్లలు, మొదటి, రెండో విడతలో కౌన్సెలింగ్‌కు హాజరు కానివారు, తిరుపతిలోని స్థానికులు, జిపిఏ 10 నుండి 9.7 వరకు ఉన్న విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటలకు జిపిఏ 9.6 కంటే తక్కువ ఉన్న విద్యార్థులకు అడ్మిషన్లు నిర్వహిస్తారు.
ఇదివరకే http://admissions.tirumala.org ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, సంబంధిత కళాశాలలో సీట్లు మాత్రమే కావాల్సివారు, ధ్రువీకరణపత్రాలు, ఫీజులతో నేరుగా సంబంధిత జూనియర్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లకు హాజరుకావాల్సి ఉంటుంది.
