శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 25 అక్టోబరు 2021 (17:32 IST)

ఆ టీటీడి సభ్యుడిని తొలగించండి, జనసేన నాయకులు డిమాండ్

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో సభ్యులు హిందేతర మతాలకు చెందిన వారుగా ఉండకూడదు. దీనిపైన న్యాయపోరాటం చేస్తామని బిజెపి, జనసేన పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇతర మతస్తులను ఎలా జగన్మోహన్ రెడ్డి నియమిస్తారంటూ కూడా ప్రశ్నించారు. అయినా సిఎం పట్టించుకోలేదు.
 
తాజాగా జనసేన పార్టీ నేత కిరణ్ తిరుపతిలో ఒక ఫోటోను మీడియాకు విడుదల చేశారు. అందులో టిటిడి పాలకమండలి సభ్యులుగా ఈమధ్యనే బాధ్యతలు చేపట్టిన సంజీవయ్య ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే కూడా. టిటిడి పాలకమండలి సభ్యులంటే సాధారణంగా హిందూ మతాన్నే గౌరవించాల్సి ఉంటుంది.
 
అలాంటి వ్యక్తి శిలువ ఆకారాన్ని లాక్కుంటూ క్రైస్తవులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇది కాస్త ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. వెంటనే సంజీవయ్యను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు జనసేన పార్టీ నాయకులు. సంజీవయ్య ఒక్కరే కాకుండా ఇంకా చాలామందే ఉన్నారని కూడా చెబుతున్నారు.