సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , సోమవారం, 25 అక్టోబరు 2021 (12:01 IST)

పుర పోరులో కుదిరిన దోస్తీ...కొండ‌ప‌ల్లిలో బీజేపీ జ‌న‌సేన క‌లిసి పోటీ!

ప్రతిష్టాత్మక విజ‌య‌వాడ శివారు కొండపల్లి పుర పోరులో జనసేన, బిజేపి మిత్ర బంధం యదావిధి కొనసాగనుంది. రాష్ట్రం లో బిజేపి, జనసేన మద్య కొనసాగుతున్న స్నేహ బంధం సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ, కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో సైతం అమలు చేయనున్నారు. అధికార వైసీపీ కి ధీటుగా మున్సిపాలిటీ పరిధిలోని 29 వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్ధులను నిలబెట్టి తమ సత్తా చాటేందుకు సిద్ధం అయ్యారు.
 
కొండ‌ప‌ల్లి మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డుల్లో సగ భాగం సీట్లు బిజేపి, సగం జనసేన పోటీ చేసే విధంగా ఒప్పందం కుదిరినట్లు విశ్వసనీయ సమాచారం. సీట్ల పంపకాల పై ఇరు పార్టీల నేతలు ఇప్పటికే ఏకాభిప్రాయనికి రాగా, ఎక్కడ ఏ ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారు అన్న అంశాల పై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రెండు పార్టీల కలయిక తో అధికార వైసీపీకి గట్టి పోటీ ఇస్తామనే ధీమాతో ఇరు పార్టీల నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.