1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Techie suicide in hyderabad

యువతితో సహజీవనం.. వదిలి వెళ్లిపోయిందని యువకుడి ఆత్మహత్య

Techie
ప్రేమించిన యువతి తనను విడిచి వెళ్లిపోవడంతో ఓ టెక్కీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చంద్రకిరణ్‌ (32) అనే వ్యక్తి మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పని చేస్తున్నాడు. 
 
తానుంటోన్న గదిలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల యువతితో అతడికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో రెండేళ్ల పాటు ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. నెల రోజుల క్రితం వరకు చంద్రకిరణ్ బేగంపేటలో నివాసమున్నాడు. అయితే, ఇటీవల కేపీహెచ్‌బీ పరిధిలోని తులసినగర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో గది తీసుకుని ఉంటున్నాడు. ఇటీవలే చంద్రకిరణ్‌ను వదిలి యువతి వెళ్లిపోవడంతో అతడు మనస్తాపానికి గురయ్యాడు.
 
ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి లేనిదే తాను బ్రతకలేనని ఆత్మహత్య లేఖ రాసి గదిలోనే సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
తర్వాతి కథనం
ఆగని జమాత్ సభ్యుల ఆగడాలు... బాటిళ్ళలో మూత్రంపోసిన...