మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (09:47 IST)

తెలంగాణ పోలీసు శాఖలో తొలి కరోనా పాజిటివ్... 12 మంది ఖాకీలకు క్వారంటైన్

తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో అప్రమత్తమైన ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ కరోనా వైరస్ సోకిన కానిస్టేబుల్‌తో సన్నిహితంగా ఉన్న 12 పోలీసులను కూడా క్వారంటైన్‌కు తరలించారు. 
 
సోమవారం రాత్రి వెలుగులోకి వచ్చిన ఈ విషయాలను పరిశీలిస్తే, హైదరాబాద్, సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్‌ గత కొన్ని రోజులుగా లాక్‌డౌన్ విధులను నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే, రెండు మూడు రోజులుగా తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పితో పాటు.. కరోనా లక్షణాలు ఉండటంతో వైద్యులను సంప్రదించారు. 
 
దీంతో ఆయన స్వాబ్‌తో పాటు రక్తాన్ని సేకరించి పరీక్షలు నిర్వహించగా, ఇందులో కరోనా పాజిటివ్ అని తేలింది. ఫలితంగా హెడ్ కానిస్టేబుల్‌తో ప్రైమరీ కాంటాక్ట్ అయిన 12 మంది పోలీస్ సిబ్బందిని అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. వారితో పాటు 10 మంది కుటుంబ సభ్యులను కూడా క్వారన్‌టైన్ సెంటర్‌లో ఉంచారు. 
 
ప్రస్తుతం అందరికి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా కొనిస్టేబుల్‌కు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని అధికారులు చెబుతున్నారు. అయితే, మత ప్రార్థనల్లో పాల్గొనడం వల్ల ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. కాగా కానిస్టేబుల్ ఇంకా ఎవరెవరిని కలిసాడు అని దర్యాప్తు చేస్తున్నారు.