శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 ఏప్రియల్ 2020 (16:20 IST)

ఆగని జమాత్ సభ్యుల ఆగడాలు... బాటిళ్ళలో మూత్రంపోసిన...

దేశంలో కరోనా వైరస్ కేసులు భారీ సంఖ్యలో నమోదు కావడానికి ప్రధాన కారణంగా భావిస్తున్న తబ్లీగి జమాత్ వర్కర్లు చేస్తున్న ఆగడాలు అన్నీఇన్నీకావు. గతకొన్ని రోజులుగా వారు చేస్తున్న చేస్తున్న దుశ్చర్యలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 
 
తాజాగా దేశంలోని పలుచోట్ల తబ్లిగీ జమాత్‌కు చెందిన సభ్యులను క్వారంటైన్లలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే వారిలో కొందరు బాధ్యతారహితంగా, అసహ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో నాలుగు ఫ్లాట్లలో కొందరు జమాత్ సభ్యులను క్వారంటైన్ చేశారు. 
 
వీరిలో కొందరు బాటిళ్ళలో మూత్రాన్ని పట్టి, వాటిని కిందకి విసిరేస్తున్నారు. ఈ బిల్డింగ్ వెనుక ఉన్న వాటర్ పంప్ దగ్గర రెండు బాటిళ్ళను మంగళవారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ద్వారక నార్త్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. క్వారంటైన్‌లో ఉన్న జమాత్ సభ్యులే దీనికి కాణమని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. 
 
మరోవైపు, త‌బ్లీగి జ‌మాత్ కార్యక్ర‌మానికి వెళ్లి వ‌చ్చిన ఓ వ్య‌క్తి కుటుంబానికి మొత్తం క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింద‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఖ‌ర్గోనే జిల్లా మేజిస్ట్రేట్ జీసీ డాడ్ తెలిపారు. ఈ విష‌యమై ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో గ‌త నెల‌లో జ‌రిగిన త‌బ్లీగి జ‌మాత్ కార్యక్ర‌మానికి హాజ‌రయ్యాడు. 
 
ఆ త‌ర్వాత ఇంటికి తిరిగొచ్చిన త‌ర్వాత అత‌ని నుంచి త‌ల్లికి మ‌రో ఆరుగురు కుటుంబ‌సభ్యులకు క‌రోనా సోకింది. అయితే స‌ద‌రు వ్య‌క్తి, అత‌ని త‌ల్లి మృతి చెందారు. అత‌ని కుటుంసభ్యులందిరినీ క్వారంటైన్‌కు త‌ర‌లించాం. ఆ కుటుంబంతో ట‌చ్‌లో ఉన్న మ‌రికొంద‌రిని కూడా క్వారంటైన్‌కు త‌ర‌లించామ‌ని తెలిపారు.