అక్రమ సంబంధాలపై యువతులకు మహిళ హెచ్చరిక - నెట్టింట వైరల్‌గా వీడియో
అమెరికాలో నివసిస్తున్న తెలుగు యువతీ యువకులు పెట్టుకునే వివాహేతర సంబంధాలు, కుటుంబ బంధాలపై ఓ మహిళ మాట్లాడిన పబ్లిక్ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రవాస భారతీయుల (ఎన్.ఆర్.ఐ)ల జీవనశైలి, వివాహేతర సంబంధాలు, అక్కడ కొందరు ప్రవర్తిస్తున్న తీరుపై సదరు మహిళ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి.
ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె వ్యాఖ్యలు సమర్థిస్తుండగా, మరికొందరు ఎన్.ఆర్.ఐ సమాజాన్ని జనరలైజ్ చేయడం సరికాదంటూ మండిపడుతున్నారు. దీంతో అమెరికాలోని తెలుగు కమ్యూనిటీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
నెట్టింట వైరల్‌గా మారిన వీడియో
— RTV (@RTVnewsnetwork) September 2, 2026
అమెరికా (USA) లో నివసిస్తున్న తెలుగు వారి వివాహేతర సంబంధాలు, కుటుంబ బంధాలపై ఒక మహిళ మాట్లాడిన పబ్లిక్ వీడియో సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది
ఎన్ఆర్ఐ (NRI) ల జీవనశైలి, వివాహేతర సంబంధాలు మరియు అక్కడ కొందరు ప్రవర్తిస్తున్న తీరుపై సదరు మహిళ… pic.twitter.com/ZDvx33CbAF
